‘ఆటో’పేమెంట్!
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:09 AM
ఆటోవాలాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దసరా రోజున ఆటో కార్మికులకు రూ.15 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రక టించింది. స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలవుతున్న నేపథ్యంలో ప్రయాణికులు తగ్గిపోయి ఆర్థికంగా నష్టపోతున్నందున వీరిని ఆర్థికంగా ఆదుకోనున్నట్టు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.
ఆటో కార్మికులకు ప్రభుత్వం తీపికబురు
స్త్రీశక్తి పథకం నేపథ్యంలో నష్టపోతున్న ఆటోవాలాలకు ఏటా రూ.15 వేలు
దసరా రోజున పథకం ప్రారంభించనున్నట్టు ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఉమ్మడి జిల్లాలో 46 వేల ఆటో కార్మికులకు రూ.69 కోట్ల వరకు ఆర్థిక లబ్ది
ఇప్పటికే హరిత పన్ను తగ్గించడంతో ఆటోలకు భారీగా తగ్గిన పన్ను భారం
ఆటోవాలాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దసరా రోజున ఆటో కార్మికులకు రూ.15 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రక టించింది. స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలవుతున్న నేపథ్యంలో ప్రయాణికులు తగ్గిపోయి ఆర్థికంగా నష్టపోతున్నందున వీరిని ఆర్థికంగా ఆదుకోనున్నట్టు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆటోవాలాలకు ఆర్థిక సాయం పథకం దసరాకు ప్రారంభించనున్నట్లు అనంతపురం సభలో బుధవారం అధికారికంగా ప్రకటించడంతో ఆటో కార్మికుల్లో హర్షాతిరేకాలు మిన్నంటుతున్నాయి.
(కాకినాడ,అమలాపురం-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులకు ప్ర భుత్వం వరం ప్రకటించింది. ఆటో కార్మికుల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అర్హత కలిగిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్న ట్టు సీఎం చంద్రబాబునాయుడు బుధవారం ప్రకటించారు. సూపర్‌సిక్స్ పథకాల సక్సెస్ సందర్భంగా అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. గత నెల 15వ తేదీ నుంచి మహిళలకు స్ర్తీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్ర యాణం కల్పించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణాల కారణంగా ఆటోడ్రైవర్ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గత కొన్ని రోజుల నుంచి ఆటో కార్మికులు ఽధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నా రు. అదే సమయంలో ఉచిత ప్రయాణం అమలు నేపథ్యంలో ఆటోకార్మికులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు ఒక్కో ఆటోవాలాకు అక్టోబరు 2న విజయదశమి రోజున ఆటో కార్మికులకు రూ.15వేల వంతున సాయాన్ని అందిస్తామని సీఎం చేసిన ప్రకటనతో ఆటో కార్మి కుల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి. పూట గడ వడం కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాయం వేలాది ఆటో కార్మికుల జీవితాలకు ఆర్థిక భరోసా నింపనుందని ఆటో కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. ఇదిలాఉంటే ఉమ్మడి తూర్పుగో దావరి జిల్లాలో 46 వేల వరకు ఆటోలున్నాయి. ఇందులో కాకినాడ జిల్లాలో 13,194, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 14 వేలు, తూర్పుగోదావరి జిల్లా లో 17వేల వరకు ఆటోలున్నట్టు రవాణాశాఖ అధి కారులు చెబుతున్నారు. అయితే ఆటోయూనియన్లు మాత్రం 50 వేలపైనే ఆటోలు ఉంటాయని చెబు తున్నాయి. ఈ పథకం అమలైతే ఉమ్మడి జిల్లాకు రూ.69 కోట్ల వరకు నిధులు కావలసి ఉంది.
అప్పట్లో ఊరించి ఊరించి అరకొరే..
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం ద్వారా రూ.10 వేల సాయా న్ని అందించారు. అదీ లబ్ధిదారులను ఎడాపెడా కోసేసి సంఖ్య తగ్గించేశారు. పైగా ఆటో కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు జమ అయిన కొన్ని రోజులకే అప్పటి ప్రభుత్వం ఆర్టీవోలను రంగంలోకి దించింది. చలాన్ల పేర్లతోను, రవాణాశాఖ నిబంధ నల పేరుతోను రకరకాల ఫైనలు విధించి ఆ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాగేసుకునేది. పైగా వాహనమిత్ర పథకాన్ని కొంతకాలమే అమలుచేసి గాలికి వదిలే శారు. ఇక దసరా నుంచి అమలుకానున్న పథకా నికి సంబంధించి ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకా లు జారీచేయనుంది. పథకానికి అర్హత సాధించడా నికి నిబంధనలపై స్పష్టత ఇవ్వనుంది. సొంత ఆటో ఉన్నవారు, అలాగే అద్దెకు తీసుకుని నడుపు తున్న కార్మికులు ఉమ్మడి జిల్లాలో చాలామంది ఉన్నారు. ఈనేపథ్యంలో సొంత ఆటో లేని కార్మికు లకు సాయం ఉంటుందా? లేదా? అనేదానిపై స్పష్టత రానుంది. ఇదిలా ఉంటే గతంలో ఆటోలు ఉన్నప్పటికీ ఆటో నడిపే లైసెన్సు, బ్యాడ్జీలు కలిగిన వారికి మాత్రమే పథకం వర్తింపజేశారు. ఈ నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. దీనిపై కోనసీమ జిల్లా రవాణాధికారి శ్రీనివాసరావును వివరణ కోరగా ప్రభుత్వం జారీ చేయనున్న మార్గదర్శకాల ద్వారానే ఎంత మంది లబ్ధిపొందుతారనేది తేలనుందని చెప్పారు.
మేలో హరిత పన్నుతో ఆనందం..
ప్రజలను ఎడాపెడా పన్నులతో బాదేయడమే పనిగా పెట్టుకున్న గత వైసీపీ ప్రభుత్వం ఏటా వాహనదారుల నుంచి కోట్లలో పిండేసింది. హరిత పన్ను పేరుతో ఎవరినీ వదలకుండా రోడ్డెక్కిన ప్రతి వాహనం నుంచి డబ్బులు గుంజేసింది. లారీ లు, టిప్పర్లు, కార్లు, ఆటోలు, స్కూలు బస్సులు, చివరకు బైక్‌లను కూడా పన్ను పేరుతో జేబులు గుల్లచేసేసింది రవాణా, రవాణాయేతర రంగాలకు సంబంధించి ఆయా వాహనాల నుంచి ఉమ్మడి జిల్లాలో రవాణా శాఖ అధికారులు హరితపన్నును వసూలు చేసేవారు. బైక్ నుంచి లారీ, టిప్పర్, ఆటో, స్కూల్ బస్సుల వరకు వాహనం రిజిసే్ట్రషన జరిగిన తేదీ నుంచి ఏడేళ్లు దాటితే వాటి నుంచి రూ.200 వరకు మాత్రమే కట్టించుకునేవారు. కానీ 2019లో జగన ప్రభుత్వం వచ్చాక అన్ని రకాల వాహనాలపై హరితపన్నును భారీగా పెంచేసింది. సాధ్యమైనంత డబ్బును కోట్లలో పిండుకునేందుకు 2022 జనవరి 1 నుంచి హరితపన్ను పెంపును అమలుచేసింది. అప్పటిదాకా రూ.200 ఉన్న పన్ను ను వివిధ శ్లాబ్‌లుగా విడదీసేసింది. వాహ నం కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడు నుం చి పదేళ్లు అయితే సగం త్రైమాసిక పన్ను విలువ, వాహనం వయస్సు పది నుంచి పన్నెండేళ్లుదాటితే ఒక త్రైమాసికం పన్ను విలువ, 12ఏళ్లు దాటితే రెండు త్రైమాసికాల పన్ను విలువ పెంచేసింది. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రవాణా, రవా ణాయేతర వాహనాలపై భారీగా పన్ను భా రం పడింది. పెరిగిన పన్ను భారం భరించ లేక వాహనదారులంతా ఆందోళనలు చేశారు. అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో హరి త పన్ను దోపిడీ గురించి తెలుసుకున్న చం ద్రబాబు ఈ ఏడాది మేలో రవాణా, రవాణా యేతర వాహనాలపై హరిత పన్నును తగ్గి స్తూ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆటోవా లాలకు భారీగా పన్ను భారం తప్పింది.