Share News

ఆటో డ్రైవర్ల అండగా ప్రభుత్వం

ABN , Publish Date - Oct 05 , 2025 | 01:08 AM

ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖా మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శనివారం కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పఽథకం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతి థిగా మంత్రి నారాయణ విచ్చేశారు.

ఆటో డ్రైవర్ల అండగా ప్రభుత్వం
ఏలేశ్వరంలో ఆటో నడుపుతున్న మంత్రి నారాయణ

  • ‘ఆటో డ్రైవర్ల సేవలో..’ కార్యక్రమంలో ఇన్‌చార్జి మంత్రి నారాయణ

  • కాకినాడ జిల్లావ్యాప్తంగా 12,966 మందికి రూ.19.44 కోట్లు

  • నగదు పంపిణీని ప్రారంభించిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌

  • ఆటో డ్రైవర్ల అవతారం ఎత్తిన ఎంపీ, ఎమ్మెల్యేలు.. అంతటా ఇదే సందడి

ఏలేశ్వరం, అక్టోబరు4(ఆంధ్రజ్యోతి): ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖా మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శనివారం కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పఽథకం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతి థిగా మంత్రి నారాయణ విచ్చేశారు. అలాగే ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్‌ తుమ్మ ల రామస్వామి, ఎమ్మెల్సీ రాజశేఖర్‌, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులతో నిర్వహించిన సభలో మం త్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా ప్రస్తుత ముఖ్యమంత్రి చం ద్రబాబునాయుడు రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. సూపర్‌ సిక్స్‌ పఽథకంలో ఆటో డ్రైవర్ల సేవా పథకం లేకపోయినా ప్రభుత్వం డ్రైవర్ల కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతీ సంవత్సరం లబ్ధిదారులకు రూ.15 వేలు నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్‌ సిక్స్‌ పఽథకాలతో పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరిందన్నారు. తొలుత ప్రజాప్రతినిధులు మూడు కిలోమీటర్ల మేర ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సహా ప్రజాప్రతినిధులంతా ఖాకీ చొక్కాలు ధరించి ఆటోలు నడిపారు. అనంతరం ఆటోడ్రైవర్లు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌, టీడీపీ నాయకులు తోట నవీన్‌, నగర పంచాయతీ చైర్‌సర్సన్‌ అలమండ సత్యవతి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • ఎంతో అట్టహాసంగా..

‘ఆటో డ్రైవర్ల సేవలో..’ పథకాన్ని శనివారం ప్రారంభించడంతో జిల్లావ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ప్రధాన కూడళ్ల వద్ద ఎక్కడ చూసినా ఇదే చర్చ. ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.15 వేలు ఏటా వేస్తామని కూటమి ప్రభుత్వం ఆకస్మికంగా ప్రకటించింది. ఉచిత బస్సు ప్రయాణాల వల్ల తమ ఉపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తంచేస్తున్న ఆటో కార్మికులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించిన విష యం తెలిసిందే. దసరా సందర్భంగా ఈ సొమ్మును అందజేస్తామని తెలియజేసినట్టుగానే అర్హులైన వారందరికీ ఆ సొ మ్ములను బ్యాంకుల్లో జమచేశారు. జిల్లాకు వచ్చేసరికి ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌, మోటార్‌ క్యాబ్‌ వాహనాలు నడిపే 12,966 మంది డ్రైవర్లకు రూ.19 కోట్ల 44 లక్షల 90 వేలు జమ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాకినాడ అర్బన్‌ నియోజకవర్గానికి సంబంధించి 1938 డ్రైవర్లకు రూ.2 కోట్ల 90 లక్షల 70 వేలు వారి అకౌంట్లలో జమచేసినట్టు వెల్లడించారు. జిల్లా అంతటా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం జమ కావడంతో అందరిలో ఎంతో ఉత్సాహం నెలకొంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పలుచోట్ల పాలాభిషేకాలు నిర్వహించారు.

Updated Date - Oct 05 , 2025 | 01:08 AM