Share News

అంతర్వేదిలో రయ్‌ రయ్‌...

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:13 AM

అంతర్వేది, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేది పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికం, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. రానున్న కార్తీకమాసం పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున బీచ్‌లో ఎనిమిది ఏటీవీ బైకులను

అంతర్వేదిలో రయ్‌ రయ్‌...
కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్‌లో సిద్ధంగా ఉన్న ఏటీవీ బైకులు

బీచ్‌లో ఏటీవీ బైకులు

ఆనందం వ్యక్తం చేస్తున్న పర్యాటకులు

అంతర్వేది, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేది పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికం, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. రానున్న కార్తీకమాసం పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున బీచ్‌లో ఎనిమిది ఏటీవీ బైకులను స్థానికులు సిద్ధం చేశారు. ఒక్కొక్కటీ రూ.3లక్షల ఖరీదు కలిగిన ఈ బైకులు పెట్రోల్‌తో నడుస్తాయి. పర్యాటకులు బైకులపై చక్కర్లు కొడుతూ సముద్రపు కెరటాల అలలను ఆస్వాదిస్తున్నారు. దుబాయ్‌ వంటి దేశాల్లో ఇసుకలో నడిచే ఈ ఏటీవీ బైకులు అంతర్వేది సముద్ర తీరంలో ఏర్పాటు చేయడంపై పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 20 , 2025 | 12:13 AM