దాడి కేసులో ముగ్గురి నిందితుల అరెస్ట్
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:24 AM
సర్పవరం జంక్షన్, అక్టోబరు 6 (ఆంధ్ర జ్యోతి): రెండు ఫాస్ట్ పుడ్ సెంటర్ నిర్వాహకుల మధ్య తలెత్తిన వ్యాపారా విభేదాలతో చాకుతో దాడి చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు సర్పవరం ఎస్‌ఐ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్‌లో భావనారాయణ
సర్పవరం జంక్షన్, అక్టోబరు 6 (ఆంధ్ర జ్యోతి): రెండు ఫాస్ట్ పుడ్ సెంటర్ నిర్వాహకుల మధ్య తలెత్తిన వ్యాపారా విభేదాలతో చాకుతో దాడి చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు సర్పవరం ఎస్‌ఐ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్‌లో భావనారాయణ స్వామి ముఖద్వారం వద్ద బాలాజీ ఫాస్ట్ పుడ్ సెంటర్, కృపా ఫాస్ట్‌పుడ్ సెంటర్లు నిర్వహిస్తు న్నారు. ఈ రెండింటి మఽధ్య వ్యాపారాల లావా దేవీల నడుమ ఆగస్టులో ఇరు వర్గాల మధ్య తగాదా జరగడంతో రెండు పక్షాలపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అక్టోబర్ 4వ అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య ఘ ర్షణ జరగడం, పితాని నవీన్ కుమార్‌పై తుట్టా వెంకట బాలాజీ ఉల్లిపాయలు కోసి చాకుతో దాడికి పాల్పడటంతో తీవ్ర గాయాలయ్యాయన్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు సర్పవరం ఎస్ హెచ్‌వో బి.పెద్దిరాజు ఆదేశాల మేరకుకేసు నమోదు చేసి దర్యాప్తు చేశామ న్నారు. నింది తుల కోసం గాలిస్తూ సోమవారం ఉదయం బాలాజీ ఫాస్ట్‌పుడ్ సెంటర్ వద్ద అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించడం జరిగిందని తెలిపారు.