అర్ధరాత్రి అమానుషం!
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:25 AM
పిఠాపురం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి వేళ కత్తులతో వెంబడించి మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన పిఠాపురంలో తీవ్ర సంచనలం రేకెత్తించింది. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీ వద్ద గల జేజీఆర్ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అల్లం సునీ త బుధవారం అర్ధరాత్రి
కత్తులతో వెంబడించి.. మహిళపై దాడి
తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు
పిఠాపురంలో ఘటన
పిఠాపురం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి వేళ కత్తులతో వెంబడించి మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన పిఠాపురంలో తీవ్ర సంచనలం రేకెత్తించింది. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీ వద్ద గల జేజీఆర్ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అల్లం సునీ త బుధవారం అర్ధరాత్రి సమయంలో డ్యూటీ ముగించుకుని బైక్‌పై వైఎస్‌ఆర్ గార్డెన్‌లోని ఇంటికి బయలుదేరింది. జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో వెనుక నుంచి మోటార్‌సైకిల్‌పై ఇద్దరు అగంతకులు వెంబడిస్తూ వచ్చారు. సీతయ్యగారితోట, నరసింగపురం రోడ్డు జంక్షన్ వద్దకు వచ్చి పట్టణంలోని రోడ్డు మీదకు ప్రవేశించి స్పీడ్‌బ్రేకర్ల వద్ద ఆగడంతో వారు కత్తులతో వచ్చి వెంబడించారు. కత్తులతో సునీత కడుపు, మెడ, చేతులపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె అరవడంతో పాటు అదే సమయంలో ఎదురుగా వచ్చిన కారు లైటింగ్ పడటంతో అగంతకులు పరారయ్యారు. అదే సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో సునీత సృ హ తప్పి పడిపోయింది. స్థానికులు అందించిన సమాచారంతో పిఠాపురం పట్టణ, రూరల్ ఎస్‌ఐ లు మణికుమార్, జానీబాషా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమెను తొలుత పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి అక్కడ నుంచి మెరుగైన చికి త్స నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
దాడి చేసింది ఎవరు?
కాగా కత్తులతో మోటార్‌సైకిల్‌పై వెంబడించి మహిళపై దాడి చేసిన సంఘటన పిఠాపురం పట్టణంలో సంచలనంగా మారింది. ఇది ఎవరు చేశారు అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భర్త, మరో మహిళ తనపై దాడికి కారణం కావచ్చనని బాధిత మహిళ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. అయితే పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.