Share News

అభివృద్ధికి..జల బాట!

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:45 AM

ఓడరేవులు, నదీ జల రవాణాతో పారిశ్రామి కంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు అద్భుత భవిష్యత్తు లభించబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు.

అభివృద్ధికి..జల బాట!

ఓడరేవు, లాజిస్టిక్‌ అభివృద్ధి

రూ.2,621 కోట్లతో గేట్‌వే పోర్టు

వచ్చే ఏడాది డిసెంబర్‌కు పూర్తి

జలరవాణాకు కసరత్తు

విమానాశ్రయ రన్‌వే విస్తరణ

ఓఎన్జీసీ, గెయిల్‌ విధ్వంసంపై చర్చ

ఉమ్మడి జిల్లాకు అద్భుత భవిష్యత్తు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

ఓడరేవులు, నదీ జల రవాణాతో పారిశ్రామి కంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు అద్భుత భవిష్యత్తు లభించబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. అత్యంత చవకైన కార్గో రవాణా ద్వారా పారిశ్రామిక అభివృద్ధి పెద్ద ఎత్తున జరగనుం దని వివరించారు. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం శుక్రవారం పారిశ్రామిక, ఓడరేవు, లాజిస్టిక్‌ రం గాల్లో కొనసాగుతున్న పెట్టుబడులు, భవిష్యత్‌ ప్రాజెక్టులను కూలంకషంగా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా విశ్లేషించారు. తీరప్రాంతాన్ని గుజరాత్‌ తర్వాత దేశంలో ఆంధ్రప్రదేశ్‌ సమర్థ వంతంగా వినియోగించుకుంటోందన్నారు.

సీఎం ఏమన్నారంటే..

కాకినాడ గేట్‌వే పోర్టు(కేజీపీఎల్‌) రూ.2,621 కోట్లతో చేపట్టిన కొత్త పోర్టు నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తవుతుందన్నారు. ఈ కొత్త పోర్టు అందుబాటులోకి వస్తే ఏటా 16 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కార్గో హ్యాండ్లింగ్‌ జరుగుతుందన్నారు. ప్రస్తుతం పోర్టులో మూడు బెర్తుల నిర్మాణం జరుగుతోంది. ఒకటి బొగ్గు దిగుమతికి, మరో రెండు బెర్త్‌లు అన్ని రకాల కార్గో ఎగుమతి,దిగుమతులకు వినియోగిస్తు న్నారన్నారు. వచ్చే ఏడాది డిసెంబరుకు ఇది అందుబాటులోకి వస్తే మౌలిక వసతులు, పారి శ్రామికంగా ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంద ని సీఎం వివరించారు. ఇదికాకుండా ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాకినాడ సీపోర్టు ద్వారా ఏటా 26 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు, కాకినాడ యాంకరేజ్‌ పోర్టు ద్వారా 4 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు, కోనసీమలోని రవ్వ పోర్టు ద్వా రా 2 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ముడిచమురు కార్గో కార్యకలాపాల ద్వారా జరుగుతున్నా యన్నారు. భవిష్యత్తులో ఈ పోర్టుల ద్వారా వ్యాపారం పెరుగుతుందన్నారు.

జల రవాణాపై ఇదీ లెక్క..

ఉమ్మడి జిల్లాలో కాకినాడ నుంచి ఏలూరు కాలువ వరకు ఇన్‌లాండ్‌ వాటర్‌ కింద నదీ మార్గాల్లో కార్గో తరలింపుపైనా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వివరించారు. గోదావరి నది ద్వారా కృష్ణాకు, కాకినాడ-ఏలూరు కాలువ, కాకినాడ-బకింగ్‌హాం కెనాల్‌ నుంచి చెన్నైకు, గోదావరి ద్వారా మహారాష్ట్రకు జల రవాణాకు ఎంతో ఆస్కారం ఉందని వివరించారు. నదు లపై కాలువ మార్గాల ద్వారా అనేక పరిశ్ర మలకు కార్గో ఏవిధంగా తరలించవచ్చనే దానిపై ఇప్పటికే టెండర్లు పిలిచామని చెప్పారు. ఈ మార్గాలను అభివృద్ధి చేయడానికి కొందరు ముందుకు వస్తున్నారన్నారు. రవాణా రంగం ఖర్చుల విషయానికి వస్తే టన్ను కార్గో రవాణా ఖర్చుకు రోడ్డు మార్గం ద్వారా రూ.3.78 అవు తుంటే.. సముద్రమార్గం రవాణాకు రూ.1.80, నదీ జలరవాణాకు రూ.3.30 అవుతుందన్నారు.

ఓఎన్జీసీ, గెయిల్‌పై వాడివేడిగా..

ఉమ్మడి జిల్లాలో చమురు, గ్యాస్‌ కార్య కలా పాలు నిర్వహిస్తోన్న ఓన్జీసీ, గెయిల్‌ సంస్థల తీరుపై అసెంబ్లీలో కోనసీమ జిల్లా ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓఎన్జీసీ, గెయిల్‌ గ్యాస్‌, చమురు పైపులైన్ల కారణంగా గోదావరి తీర ప్రాంతం దెబ్బతిందని, ప్రధానంగా కోన సీమ జిల్లాలో భూగర్భ జలాలు పాడైపోయా యని రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు కంపెనీలు కనీసం సీఎస్సార్‌ అమలులోను బాధ్యత లేకుండా వ్యవ హరిస్తున్నాయన్నారు. ఈ సంస్థల వల్ల అనేక చోట్ల భూమి కుంగిపోయి డ్రైనేజీ సమస్యలు వస్తున్నాయని వివరించారు. దీనిపై శాస్త్రీయ అధ్యయనం జరగాలని డిమాండ్‌ చేశారు. పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి మాట్లాడుతూ ఈ రెండు సంస్థలు ఏర్పాటయ్యే సమయంలో స్థాని కులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత మోసగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిద్దరి ప్రశ్నలకు మంత్రి బీసీ జనార్దనరెడ్డి అసెంబ్లీలో సమా ధానం ఇచ్చారు. ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యలపై త్వరలో అధికారుల ద్వారా నివేదిక రప్పి స్తామని, తదననుగుణంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. భూమి కుంగిపోవడం, సముద్రంలోకి వెళ్లకుండా మురు గునీటి డ్రైన్లు పొంగుతున్నాయన్న సమస్యపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎ స్సార్‌ నిధులు ఖర్చు చేయడం లేదనే విష యంపై నివేదికలు రప్పిస్తామని తెలిపారు.

ప్రతిపాదనలు సిద్ధం..

ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో గోదావరి కాలు వల పై సరుకు రవాణా, పర్యాటక యాత్రలకు పది రూట్లను ఏపీ ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథా రిటీ ఎంపిక చేసి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నేషనల్‌ వాటర్‌వే-4 ద్వారా కాకినాడ కెనాల్‌, గోదావరి మీదుగా సిమెంట్‌ ఫ్యాక్టరీలు, పవర్‌ ప్లాంట్లకు ముడిసరుకు సరఫరాకు ప్రణాళికలు తయారు చేసింది. ఈ మేరకు కాకినాడ- రాజ మహేంద్రవరం, రాజమహేంద్రవరం- విజయ వాడ కెనాల్‌, రాజమహేంద్రవరం- భద్రాచలం, పురుషోత్తపట్నం-భద్రాచలం గోదావరి మార్గం, పురుషోత్తపట్నం-పోలవరం,నర్సాపుర్‌ వెస్ట్‌- అం తర్వేది- సఖినేటిపల్లి, కోటిపల్లి-ముక్తేశ్వరం మా ర్గాలను ఎంపిక చేసింది. విమానయాన రం గాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాజమ హేంద్రవరం ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ కూడా చేపట్టామని సీఎం వివరించారు.

నా తర్వాత సీనియర్‌ మోస్ట్‌ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : నేను రాజమహేంద్ర వరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ య్యచౌదరిని అభినందిస్తున్నా. సభలో నా తర్వాత సీనియర్‌ మోస్ట్‌ ఎమ్మెల్యే. ఆయన స్ఫూర్తి కూడా. మొదటి నుంచి చూస్తున్నా.ఏదైనా చెబితే మొత్తం సబ్జెక్ట్‌ నేర్చుకుని మాట్లాడతారని సీఎం చంద్ర బాబు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటిం చారు. ఎమ్మెల్యే,టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ చంద్రబాబునుద్దేశించి మిమ్మల్ని చూ స్తుంటే అప్పుడే నేను ఎందుకుపుట్టాను.. మరో 40 ఏళ్ల తర్వాత పుట్టి ఉంటే బాగుండును. ఎందుకంటే మీరు తెచ్చిన డిజిటల్‌, ఇతర టెక్నాలజీలు నేర్చుకోవ డానికి చచ్చిపోతున్నాం..అమెరికాలో ఉన్న మనవళ్లకు ఫోన్‌ చేసి వాళ్ల ద్వా రా నేర్చుకుంటున్నా. రాష్ట్ర ప్రగతికి అవ సరమైన సంస్కరణలు మీరే తెచ్చారు. ఆంధ్ర,తెలంగాణ బిడ్డలంతా ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి మీ నిర్ణయా లే కారణమని చెప్పారు. రాక్షసులు తి రిగి వస్తారనే ఆలోచన ఉండకూడదు. 20 నుంచి 30 ఏళ్లు సెంట్రల్‌ జైలే వా రికి గతి అనేది తెలియాలన్నారు.

ఈనాం భూముల రైతుల

ఇబ్బందులు తొలగించాలి

ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు

కొవ్వూరు,సెప్టెంబరు 26 (ఆంధ్ర జ్యో తి): కొవ్వూరు మండలం ఆరికిరేవుల, నందమూరు, పశివేదల, వేములూరు గ్రామాల్లో రైతులు ఈనాం భూములకు సంబంధించి ఇబ్బందులను తొలగించాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కోరారు. అసెంబ్లీలో శుక్రవారం మా ట్లాడారు.ఈనాం భూములకు గతంలో మాదిరిగా అడంగల్‌, 1బీలు ఇచ్చి లా వాదేవీలు జరిగేటట్లు చూడాలన్నారు. గడచిన ప్రభుత్వం నాడు-నేడు పథకం కింద రూ.కోట్లాది రూపాయలతో పాఠశాల భవన నిర్మాణాలు చేపట్టి అసం పూర్తిగా వదిలేశారన్నారు. నాడు నేడు నిధుల వినియోగంపై దర్యాప్తు చేపట్టాలని కోరారు.అనంతరం వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని కలిసి తాళ్లపూడి మండలం పె ద్దేవంలో థైలేరియాసిస్‌ వ్యాధితో గేదెలు మృతిచెందిన రైతులను ప్రభుత్వం ఆ దుకోవాలని వినతిపత్రం అందజేశారు.

Updated Date - Sep 27 , 2025 | 12:45 AM