శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యేలు దేవ, గిడ్డి
ABN , Publish Date - Sep 19 , 2025 | 01:43 AM
అమరావతిలో గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
మలికిపురం,సెప్టెంబరు18(ఆంధ్రజ్యోతి): అమరావతిలో గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందుకోసం జిల్లాలోని ఎమ్మెల్యేలంతా ముందుగానే తరలివెళ్లారు. వారిలో జనసేనకు చెందిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కూడా ఉన్నారు. ఈ సమావేశాల్లో భాగంగా గురువారం జనసేన శాసనసభా పక్ష కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు దేవ, గిడ్డి పా ల్గొని అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు.