Share News

పిఠాపురంలో ఉమ్మడి జిల్లా ఆర్చరీ పోటీలు

ABN , Publish Date - Oct 27 , 2025 | 12:22 AM

పిఠాపురం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభు త్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఉమ్మడి తూ ర్పు గోదావరి జిల్లా ఆర్చరీ పోటీలను ఆదివారం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ ప్రారంభించా

పిఠాపురంలో ఉమ్మడి జిల్లా ఆర్చరీ పోటీలు
పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులు

రాష్ట్రస్థాయి పోటీలకు 36 మంది క్రీడాకారులు ఎంపిక

పిఠాపురం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభు త్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఉమ్మడి తూ ర్పు గోదావరి జిల్లా ఆర్చరీ పోటీలను ఆదివారం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా ఆర్చరీ అసోసియేషన్‌ ఆధ్వ ర్యంలో ఇండియన్‌ రౌండ్‌ సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌, సీనియర్స్‌ మెన్‌, ఉమెన్‌ విభాగాల్లో జరిగిన పోటీల్లో కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 150 మం దికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ ప్రథమ స్థానంలో పిఠాపురం, ద్వితీయ స్థానంలో రాజమహేంద్రవరం, తృతీయ స్థానంలో కాకినాడ క్రీడాకారులు నిలిచారు. ప్రతిభ ఆధారంగా 36 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశా రు. వీరు నవంబరు 1, 2, 3న విజయవాడలో జరిగే పోటీల్లో ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారు. విజేతలకు ప్రిన్సిపాల్‌ వి.కేశవరావు, ఏపీ ఇంటర్మీడియట్‌ నాన్‌ గెజిటెట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ కార్యనిర్వాహక కార్యదర్శి పి.సురేష్‌కుమార్‌, కె.పద్మనాభం, రమణ, చిన్నబ్బాయి బహుమతులు అందజేశారు. ఉమ్మడి జిల్లా ఆర్చరీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పి.లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు న్యాయనిర్ణేతలుగా ముమ్మిడి గణేష్‌, జి.శివప్రసాద్‌,పి.పవన్‌ వ్యవహరించారు.

Updated Date - Oct 27 , 2025 | 12:22 AM