బాలబాలాజీ కల్యాణోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - May 25 , 2025 | 11:49 PM
మామిడికుదురు, మే 25 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లి బాలబాలాజీ కల్యాణోత్సవాలు ఆదివారం పందిరి రాట పాతడంతో
మామిడికుదురు, మే 25 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లి బాలబాలాజీ కల్యాణోత్సవాలు ఆదివారం పందిరి రాట పాతడంతో ప్రారంభమయ్యాయి. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆదివారం సహాయ కమిషనర్ ఎం.సత్యనారాయణరాజు కల్యాణోత్సవాలకు శ్రీకారంచుట్టారు. వైశాఖ మాసం కృష్ణపక్షం త్రయోదశి అశ్వినీ నక్షత్ర శుభ ముహుర్తాన పందిరి రాటను పాతి ప్రత్యేక పూజలు చేసి కల్యాణోత్సవాలకు ఏవిధమైన ఆటంకాలు కలగకుండా ఉండాలని కోరారు. జూన్ 5నుంచి 9 వరకు కల్యాణోత్సవాల సందర్భంగా పలు పూజా కార్యక్రమాలు జరుగుతాయని, 6న రాత్రి 9.15 గంటలకు స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అ న్ని ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు.