Share News

పేదింటికి నిధులు

ABN , Publish Date - Jun 20 , 2025 | 01:13 AM

టిడ్కో ఇళ్లకు ఎట్టకేలకు గ్రహణం వీడింది. గత వైసీపీ ప్రభు త్వ అరాచక నిర్ణయంతో వేలాది మంది లబ్ధిదారుల ఐదేళ్ల కన్నీటి వేదనకు ఎట్టకేలకు మోక్షం కలిగింది.

పేదింటికి నిధులు

టిడ్కో ఇళ్లకు ఇన్నేళ్లకు మోక్షం

ఉమ్మడి జిల్లాలో 26 వేల ఇళ్లు

గత ప్రభుత్వంలో పట్టని తీరు

వసతులకు కూటమి పచ్చజెండా

నిధులకు ప్రభుత్వ ఆదేశాలు

రూ.103 కోట్ల విడుదలకు జీవో

కొంతైనా పనుల్లో కదలికకు చాన్స్‌

టిడ్కో లబ్ధిదారుల్లో ఆనందం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

టిడ్కో ఇళ్లకు ఎట్టకేలకు గ్రహణం వీడింది. గత వైసీపీ ప్రభు త్వ అరాచక నిర్ణయంతో వేలాది మంది లబ్ధిదారుల ఐదేళ్ల కన్నీటి వేదనకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఫేజ్‌1, ఫేజ్‌2 ఇళ్లకు సం బంధించి మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2019కు ముందు టీడీపీ ప్రభుత్వం 23,400 ఇళ్లను పట్టణ పేదల కోసం ఏపీ టిడ్కో పేరుతో నిర్మిం చింది. ఇందులో రెండో దశ ఇళ్లు 2,600కాగా దాదాపు ఇవి పూర్త య్యే సమయానికి వైసీపీ అధికారంలోకి రావడంతో గ్రహణం పట్టుకుంది. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయిస్తే టీడీపీ ప్రభుత్వానికి మంచి పేరొస్తుందన్న భయంతో ఐదేళ్లు కక్ష పూరితంగా వ్యవహరించింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో గ్రహణం వీడింది. ఉమ్మడి జిల్లాలో రెండు దశల ఇళ్ల మరమ్మ తులకు రూ.106 కోట్ల అవసరం ఉందని తాజాగా గుర్తించారు.

పేదలపై గత ఐదేళ్లూ కక్ష..

పట్టణ పేదల్లో ఎంతో మంది సొంతిళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం 2016లో టిడ్కో (టౌన్‌ షిప్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. వేగంగా షేర్‌వాల్‌ టెక్నాలజీ విధానంలో వీటిని నిర్మించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొదటి, రెండు దశల్లో 23,400 ఇళ్లను నిర్మించాలని లక్ష్యం విధించుకుంది. కాకినాడ జిల్లాలో 7,288 ఇళ్లు, కోనసీమ జిల్లాలో 9,808, తూర్పుగోదావరి జిల్లాలో 6,304 ఇళ్ల చొప్పున కట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసి రంగంలోకి దిగింది. ఇందులో తొలిదశ కింద 20,800 ఇళ్లను 2018 నాటికి పూర్తిచేసింది. నిర్మించిన అపార్ట్‌మెంట్లలో 300 ఎస్‌ఎఫ్‌టీ ఉన్న ఇళ్లను పేదలకు ఉచితంగా, 430 ఎస్‌ఎఫ్‌టీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు రూ.3.65 లక్షల రుణం, రూ.లక్ష వాటా దారుడు చెల్లించాలని నిర్ణయించారు. అర్హులైన లబ్ధిదారులకు లాటరీ విధానంలో ఇళ్లను కేటాయించారు. ఆ తర్వాత రెండో దశ కింద ఉమ్మడి జిల్లాలో 2,600 ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టింది. ఇవి దాదాపు పూర్తయ్యే సమయానికి ప్రభుత్వం మారి వైసీపీ వచ్చింది. అయితే అప్పటి సీఎం జగన్‌ వచ్చీరాగానే టిడ్కో ఇళ్లపై కక్ష తీర్చుకున్నారు.ఐదేళ్ల పాటు పూర్తిగా గాలికొదిలేశారు. దీంతో గత ఐదేళ్లూ భవనాలు పాడైపోయాయి. పేదలకు వీటిని ఇవ్వా లంటూ అప్పట్లో లబ్ధిదారులు, నాటి ప్రతిపక్ష టీడీపీ ఎన్నిసార్లు పోరాటాలు చేసినా కనీసం ఖాతరు చేయలేదు. బ్యాంకు రుణాలు తెచ్చిన లబ్ధిదారులు వాయిదాలు చెల్లించలేక యాతన పడ్డారు.

ఇన్నేళ్లకు మంచిరోజులు..

ఏడాది కిందట ప్రభుత్వం మారడంతో మళ్లీ టిడ్కో లబ్ధి దారుల్లో ఆశలు చిగురించాయి.ఎట్టకేలకు ప్రభుత్వం లబ్ధిదారు లకు తీపికబురు అందించింది. టిడ్కో గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌ నుంచి రూ.103 కోట్ల అదనపు నిధులు మం జూరు చేస్తూ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో వేలాది టిడ్కో ఇళ్లలో మౌలిక వసతుల కల్పనకు మార్గం సుగమమైంది. కాకినాడ నగరంలోని పర్లోవ పేటలో రెండో దశ కింద నిర్మించిన 904 టిడ్కో ఇళ్లు ఐదేళ్ల కిం దట పూర్తయిపోయాయి. కానీ జగన్‌ ప్రభుత్వం వీటిని ఐదేళ్లు గాలికొదిలేసింది. ఇప్పుడు రూ.55 కోట్లు ఉంటే అన్నీ పూర్తిచేసి లబ్ధిదారులకు ఇవ్వడమే మిగిలి ఉంది.కోనసీమ జిల్లాలో అమ లాపురం, మండపేట, రామచంద్రపురం పట్టణాల్లో టిడ్కో ఇళ్లలో మౌలిక వసతులకు రూ.31 కోట్లు అవసరం. తూర్పుగోదావరి జిల్లా నామవరంలో రెండో దశ కింద నిర్మించిన 1,104 ఇళ్లకు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. జిల్లాలో ఏడు ప్రాజెక్టుల కింద 6,304 ఇళ్లకు ఇప్పటికే 5,574 మందికి రిజిస్ట్రేషన్లు పూర్త య్యాయి. మౌలిక సదుపాయాల్లేక చాలా తక్కువ మంది మాత్ర మే గృహప్రవేశాలు చేశారు. చాలా ఇళ్లు పూర్తికాలేదు. నిడదవో లులో 1,755 ఇళ్లకు 1,248 మొదలుపెట్టారు. బొమ్మూరులో నిర్మించిన 2,528 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించగా 1,977 మం ది మాత్రమే తాళాలు తీసుకున్నారు. ఇక్కడ రెండో దశలో నిర్మిం చిన 2 వేల ఇళ్లను ఇంకా అప్పగించలేదు. వీటిలో మౌలిక వస తుల కల్పనకు రూ.20 కోట్లు కావాల్సి ఉంటే జగన్‌ ప్రభుత్వం నిలిపివేసింది. ప్రభుత్వం నిధుల మంజూరుకు పచ్చ జెండా ఊపడంతో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల బాధలు తప్పినట్లయింది.

Updated Date - Jun 20 , 2025 | 01:13 AM