Share News

ఏదీ..ఏపీ స్టార్స్‌!

ABN , Publish Date - Oct 27 , 2025 | 12:42 AM

వైసీపీ కబ్జా నుంచి ఓ భూమిని తెలివిగా కాపాడుకున్న జైళ్ల శాఖ అధికారులు ఆపై తుప్పలకు ధారాదత్తం చేశారు.

ఏదీ..ఏపీ స్టార్స్‌!
ఏపీ స్టార్స్‌ అకాడమీ శిలాఫలకం

వైసీపీ నుంచి కాపాడుకొని నిర్లక్ష్యం

రెండేళ్లు కావొస్తున్నా అతీగతీలేదు

రూ.10 కోట్లతో ప్రతిపాదనలు

అడుగు ముందుకు పడని వైనం

పట్టింపులేని పాలకులు..

మరిచిపోయిన అధికారులు

శిక్షణ అందక ఇక్కట్లు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ కబ్జా నుంచి ఓ భూమిని తెలివిగా కాపాడుకున్న జైళ్ల శాఖ అధికారులు ఆపై తుప్పలకు ధారాదత్తం చేశారు. రాష్ట్రానికి రావా ల్సిన ఓ పెద్ద అకాడమీ ఎటుపోయిందో అనే ఆందోళన తుప్పల మాటున శిలాఫలకంగా ఉం డిపోయింది. నిర్మాణం మాట అటుంచితే సం బంధిత ఫైలు ఉన్నతాధికారుల వద్ద నిద్రావస్థ లో ఉంది. రెండేళ్ల కిందట జరిగిన తంతు కావ డంతో స్థానిక అధికారులు దాదాపుగా ఆ విష యాన్ని మర్చిపోయారు. ఎవరైనా గుర్తు చేస్తే ఫైలు వెతకాల్సిన పరిస్థితికి ‘ఏపీ స్టార్స్‌ అకా డమీ’ నిర్మాణం చేరుకొంది.

ఏమిటీ అకాడమీ?

హోంశాఖ ఆధ్వర్యంలో జైళ్ల శాఖ కింద పని చేసే ఓ చక్కటి శిక్షణ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సంస్కరణ సేవల శిక్షణ అకాడమీ (ఇంగ్లీషు పొడి అక్షరాల్లో ఏపీ స్టార్స్‌ అంటారు). జైళ్లలోని ఖైదీలను సంస్కరించే క్రమంలో సిబ్బంది, అధి కారులు ఎంతో ఓర్పుతో నేర్పుగా పనిచేయా ల్సిన పరిస్థితి ఉంటుంది. శిక్ష ద్వారా సంస్క రిం చడం లక్ష్యంగా ఉంది. ఈ క్రమంలో విధుల్లో మంచి ఫలితాలు సాధించే దిశగా అధికారులు, సిబ్బందిని తీర్చిదిద్దడానికి ఏపీ స్టార్స్‌ అకా డమీని నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్‌ జైళ్ల శాఖ అధికారులు, సిబ్బందికి విధుల్లో సేవాభావం, ఆయుధాలు లేకపోయినా ఖైదీలను నియంత్రిం చడం, మానసిక పరిపక్వత, శారీరక దారుఢ్యం, ఒత్తిడిని జయించడం వంటి వాటిలో తర్ఫీదు ఇవ్వడం ఈ అకాడమీ ముఖ్యోద్దేశం. ఇన్‌డోర్‌, అవుట్‌డోర్‌ విభాగాలుగా ఫైరింగ్‌, కార్యాలయ సిబ్బందికి వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ ఇస్తారు.

రూ.10 కోట్లతో 45 ఎకరాల్లో

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో ఈ సంస్థ ఉండేది. రాష్ట్ర పునర్విభజన అనంతరం హైదరాబాద్‌ నుంచి 2015లో జీవో ఎంఎస్‌ నెం 121 ప్రకారం నెల్లూరులోని మూలాపేటలో ఉన్న పాత కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేశా రు.సరిపడా స్థలం లేకపోవడంతో పూర్తి స్థాయి లో శిక్షణకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జైళ్ల శాఖ కడప రేంజ్‌ పరిధిలో ఉన్న ఈ అకా డమీని రాజమహేంద్రవరానికి తరలించాలని.. పూర్తిస్థాయి భవన నిర్మాణాలు, రన్నింగ్‌ ట్రాక్‌ తదితర శిక్షణకు అసరమైన అన్ని సదుపా యాలు కల్పించాలని సంకల్పించారు. కోస్తాంధ్ర ప్రాంత డీఐజీ కార్యాలయం వెనుక ఉన్న 45 ఎకరాలను కేటాయించడంతో పాటు రూ.10 కోట్ల అంచనాతో పూర్తిస్థాయి నివేదికను జైళ్ల శాఖ డీజీకి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ పంపించారు. దీంతో 2023 నవంబరు 15న అట్టహాసంగా శిలాఫలక ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఒక్క ఇటుకను చేర్చలేదు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినా అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడడంతో సంబంధిత ఫైలు జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో భద్రంగా నిద్దరోతోందని తెలుస్తోంది. దీంతో ఈ భూమిలో తుప్పలు ఏపుగా పెరిగిపోయాయి. ఈ ప్రదేశం డీఐజీ కార్యాలయం వెనుక ఉంటుంది. అయినా అకాడమీ విషయం జైళ్ల అధికారులు దాదాపుగా మరిచిపోయినట్లుగా పరిస్థితులు చెబుతున్నాయి.

Updated Date - Oct 27 , 2025 | 12:42 AM