వెంకన్న ఆలయాభివృద్ధికి కృషి చేస్తా
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:55 AM
ఆత్రేయపురం,నవంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచి కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న శ్రీదేవి భూదేవి సమేత వాడపలి ్లశ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి తనవం తు కృషి చేస్తానని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఆదివా రం సాయంత్రం
వాడపల్లిలో శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పూజలు
ఆత్రేయపురం,నవంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచి కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న శ్రీదేవి భూదేవి సమేత వాడపలి ్లశ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి తనవం తు కృషి చేస్తానని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఆదివా రం సాయంత్రం ఆయన కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. అర్చక బృందం పూర్ణకుంభంతో మేళతాళ మంగళవాయిద్యాల నడుమ ఘనస్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ నిర్వహించుకుని స్వామిని దర్శించుకున్నారు. వసంత మండపంలో వేద పండితుల ఆశీర్వచనం స్పీకర్ దంపతులతో పాటు కుటుంబ సభ్యులు అందుకున్నారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు, ఉపకమిషనరు నల్లం సూర్యచంద్రరావు స్వామి చిత్రపటం, తీర్థప్రసాదాలు, శేషవస్త్రం సమర్పించారు. అనంతరం విలేకర్లతో స్పీకర్ మాట్లాడుతూ స్వామివారు ఎంతో ప్రా చూర్యం పొందారని, కోరిన కోర్కెలు తీర్చే దైవం గా ఖ్యాతిని అర్జించనడంతో దేశ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారన్నారు. తాను సామాన్య భక్తుడిలానే కుటుంబ సభ్యులతో స్వామిని దర్శించుకున్నానన్నారు. క్షేత్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని, మరింత అభివృద్ధికి సహాకారం అందిస్తానని ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందన్నా రు. రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం ఉచిత బ స్సు సౌకర్యం కల్పిస్తుందని, దీనికి అనుగుణంగా మహిళలతో ఆలయాల్లో రద్దీ పెరిగిందని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే బండారు తనయుడు బండారు సంజీవ్, టీడీపీ మండలాధ్యక్షుడు కూసంపూడి రామకృష్ణంరాజు, సర్పంచ్ కాయల జగన్నాథం, తహశీల్దారు రాజేశ్వరరావు, ఎస్‌ఐ రాము, నాయకులు ఉన్నారు.