ప్రతీ రైతుకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:10 AM
అనపర్తి, నవంబరు 10 (ఆంరఽధజ్యోతి): రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్య న్నపాత్రుడు అన్నారు. సోమవారం తూర్పుగో దావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు సొసైటీ వద్ద ఏర్పాటు చే
శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
అనపర్తి, నవంబరు 10 (ఆంరఽధజ్యోతి): రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్య న్నపాత్రుడు అన్నారు. సోమవారం తూర్పుగో దావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. యంత్రం ద్వారా తేమ కొలిచే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 3217 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా ఇప్ప టికే 1612 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 46మండలాల్లో 20137 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ప్రతీ రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని, పంట నష్టం అంచనా వేసేందుకు కేం ద్ర బృందాలు పర్యటించనున్నాయని నివేదిక అ ందిన వెంటనే కేంద్రం సహాయంతో రాష్ట్ర ప్రభు త్వం రైతులకు నష్టపరిహారం ప్రకటిస్తుందన్నా రు. టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ జుత్తుగ సూర్యకుమారి, ఆళ్ళ గోవిందు, కర్రి శేషారత్నం, కర్రి సత్యగౌరి, బేరా వేణమ్మ, సొసైటీ చైర్మన్లు నల్లమిల్లి సుబ్బారెడ్డి, దత్తుడు శ్రీను, కరకుదురు దత్తుడు పాల్గొన్నారు.