ఏపీఎన్జీవో ఏడు యూనిట్లకు త్వరలో ఎన్నికలు
ABN , Publish Date - Oct 12 , 2025 | 01:15 AM
జిల్లా పరిధిలోని ఏడు యూనిట్లకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ఏపీఎన్జీవో సంఘం జిల్లా అడ్‌హక్ కమిటీ చైర్మన్ మీసాల మాధవరావు తెలిపారు. శనివారం స్థానిక ఏపీ ఎన్జీవో భవనంలో జరిగిన అడ్‌హక్ కమిటీ స మావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రా జమహేంద్రవరం, ధవళేశ్వరం, అనపర్తి, కోరుకొండ, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం ఎన్జీవో సంఘం యూనిట్లకు ఎన్నిక లు జరుగుతాయన్నారు.
జిల్లా అడ్‌హక్ కమిటీ చైర్మన్ మాధవరావు
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 11(ఆం ధ్రజ్యోతి): జిల్లా పరిధిలోని ఏడు యూనిట్లకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ఏపీఎన్జీవో సంఘం జిల్లా అడ్‌హక్ కమిటీ చైర్మన్ మీసాల మాధవరావు తెలిపారు. శనివారం స్థానిక ఏపీ ఎన్జీవో భవనంలో జరిగిన అడ్‌హక్ కమిటీ స మావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రా జమహేంద్రవరం, ధవళేశ్వరం, అనపర్తి, కోరుకొండ, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం ఎన్జీవో సంఘం యూనిట్లకు ఎన్నిక లు జరుగుతాయన్నారు.ఏడు యూ నిట్లలోని వివిధ శాఖల ఉద్యోగులు విధిగా సంఘ సభ్యత్వం తీసుకోవాలన్నారు. ఈ విషయమై చర్చించడానికి ఏడు యూనిట్ల అధ్యక్ష,కార్యదర్శులతో ఈనెల 14న సాయంత్రం రాజమహేంద్రవరం ఎన్జీవో భవనంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఎన్జీవో సంఘం న్యాయకత్వంతో కలిసి పనిచేస్తామని మాధవరావు అన్నారు. సమావేశంలో జిల్లా అడహక్ కమిటీ కన్వీనర్ అనిల్‌కుమార్, కో చైర్మన్ ప్రవీణ్‌కుమార్, ఆర్థిక సభ్యుడు సత్యనారాయణ రాజు, జిల్లా సభ్యుడు ఎస్.వెంకటేశ్వరరావు, రాష్ట్ర జేఏసీ కార్యదర్శి డి.వేణుమాధవరావు తదితరులు పాల్గొన్నారు.