అక్రమ కట్టడాలపై కొరడా!
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:19 AM
కార్పొరేషన్ (కాకినాడ), నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేని భవనాలు, అదనపు అంతస్తులు, అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్-2025) మార్గదర్శకాలను విడుదల చేస్తూ జీవో నెం.225ను మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ బుధవారం జారీ చేసింది. భవనాల యజమాను
వెంటనే కూల్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
జీవో నెం.225 విడుదల
అనుమతి లేని నిర్మాణాలకు బీపీఎస్-2025 ద్వారా క్రమబద్ధీకరణకు అవకాశం
దరఖాస్తుకు 120 రోజుల గడువు
కార్పొరేషన్ (కాకినాడ), నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేని భవనాలు, అదనపు అంతస్తులు, అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్-2025) మార్గదర్శకాలను విడుదల చేస్తూ జీవో నెం.225ను మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ బుధవారం జారీ చేసింది. భవనాల యజమానులు 19 85 జనవరి 1 నుంచి 2025 ఆగస్టు 31 వరకు నిర్మించిన అనుమతి లేని (లేదా) నిబంధనలకు విరుద్ధమైన భవనాలను ఒకసారి క్రమబద్ధీకరించుకోవచ్చు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు, సీఆర్‌డీఏ, వీఎంఆర్‌డీఏ, ఐఏఎల్‌ఏ పరిధిలోని గ్రామ పంచాయతీలు కూడా ఈ పథకం కిందకి వస్తాయి.
వీటికి అవకాశం లేదు
ప్రభుత్వ భూములు, ఎండోమెంట్స్, సాగర తీరం, నదీ తీరం, వాగు వెంబడి, ట్యాంక్ బండ్, మాస్టర్ ప్లాన్‌లో రోడ్లు, ఓపెన్ స్పేస్, పార్కుకు వినియోగించే ల్యాండ్‌లు, 2025 ఆగస్టు 31 తర్వాత కట్టిన నిర్మాణాలు, ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నవాటికి అర్హత లేదు.
గతంలోనూ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే...
రాష్ట్ర ప్రభుత్వం బీపీఎస్ పథకాన్ని మరోసారి మరోసారి తీసుకొచ్చింది. ఈ మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అనుమతులు లేని భవనాలను క్రమబద్ధీకరించడా నికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ద్వారా నగర, పట్టణ ప్రజలు తమ నిర్మాణాలను, ప్లాట్లను చట్టబద్ధం చేసుకునే అవకాశముంటుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చింది. అయితే గడువు ముగి యడంతో నిలిపివేశారు. అప్పటి దరఖాస్తుల్లో చాలా వరకు పరిష్కారమయ్యాయి. గత ప్రభుత్వంలో అనుమతులు లేకుండా చాలా నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడు వాటి క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం ఇస్తోంది. 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేసింది. అయితే ఆ గడువు ముగియడంతో ఆ తర్వా త వాటిని ఆపేశారు. అప్పటి దరఖాస్తుల విషయానికి వస్తే బీపీఎస్‌కు సంబంధించి 90శాతం వరకు పరిష్కారమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అనుమతులు తీసుకోకుండా చాలా భవనాలు, అదనపు అంతస్తుల నిర్మాణాలు జరిగాయి. దీనికి కారణం ఆ పార్టీ నేతల అండదండలు ఉండటమే. అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరించారనే ఆరోపణలొచ్చాయి. ఇటీవల చేపట్టిన ఇంటింటి సర్వేలో ఈ విషయాలన్నీ బయటపడడంతో ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది.
ఎలా దరఖాస్తు చేయాలి...
ఠీఠీఠీ.ఛఞట.్చఞ.జౌఠి.జీుఽలో రిజిస్ట్రేషన్ సేల్‌డీడ్ కాపీ, ఈసీ, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్, ప్లాన్ (ఉంటే), బిల్డింగ్ ఫొటోలు, స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ (స్ట్రక్చరల్ ఇంజనీర్ నుంచి), ఇండెమ్నిటీ బాండ్‌లను దరఖాస్తుతో తప్పనిసరిగా జత చేయాలి. దరఖాస్తు ప్రారంభ రుసుము రూ.10వేలు చెల్లించి మిగతా జరిమానా మొత్తాన్ని 120 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది.
రాయితీలు-ప్రత్యేక నిబంధనలు:
1997 డిసెంబరు 31లోపు పాత భవనాలకు 25 శాతం తగ్గింపు, స్లమ్ ప్రాంతాల్లో 50శాతం తగ్గింపు.
ఎవరకి వర్తింపు:
1985 జనవరి 1 నుంచి 2025 ఆగస్టు 31 మధ్య కట్టిన భవనాలకు బీపీఎస్ వర్తిస్తుంది.
దరఖాస్తుకు గడువు
నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి 120 రోజులు మాత్రమే. ఇది తుది అవకాశమని ప్రభుత్వం ఉ త్తర్వుల్లో పేర్కొంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం
ప్రభుత్వం చివరి అవకాశంగా ఈ సంవత్సరం ఆగస్టు 31తో పూర్తయిన భవంతులకు బీపీఎస్ ద్వారా అవకాశం కల్పిం చింది. ఈ పథకం ద్వా రా అనుమతులు లేకుండా లేదా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు, అనధికార నిర్మాణాలకు అపరాధ రు సుము చెల్లించి క్రమబద్ధీకరించుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. అటువంటి నిర్మాణాలు కూల్చివేస్తాం
- కృష్ణారావు, డిప్యూటీ సిటీ ప్లానర్, కాకినాడ నగరపాలక సంస్థ