Share News

కాంగ్రెస్‌ బలోపేతమే లక్ష్యం

ABN , Publish Date - Jun 29 , 2025 | 12:50 AM

కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కాకినాడలోని డీసీసీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసి న నియోజకవ్గర్గ ఇనచార్జిలు, నాయకుల సమా వేశంలో ఆమె మాట్లాడారు.

కాంగ్రెస్‌ బలోపేతమే లక్ష్యం
కాకినాడలో కాంగ్రెస్‌ శ్రేణుల సమావేశంలో మాట్లాడుతున్న షర్మిల

  • అందుకే పార్టీ శ్రేణులతో సమావేశం

  • కేంద్రంలో కాంగ్రెస్‌ అఽధికారంలోకి రావడం ఖాయం

  • కాకినాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

కాకినాడ/కాకినాడసిటీ, జూన్‌ 28(ఆంధ్ర జ్యోతి): కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కాకినాడలోని డీసీసీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసి న నియోజకవ్గర్గ ఇనచార్జిలు, నాయకుల సమా వేశంలో ఆమె మాట్లాడారు. దీనికి జిల్లా కాం గ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మాదేపల్లి సత్యానంద రావు అధ్యక్షత వహించారు. అతిథులుగా కేంద్ర మాజీమంత్రి ఎంఎం పళ్లంరాజు, రాష్ట్ర కాంగ్రెస్‌ కిసాన సెల్‌ చైర్మన కామన ప్రభాకరరావు, ఏఐ సీసీ సంయుక్త కార్యదర్శి, డాక్టర్‌ పాలకవర్మ, జిల్లా ఇనచార్జి మేడా సురేష్‌ పాల్గొన్నారు. ముందుగా షర్మిలకు పార్టీ శ్రేణులు ఘన స్వా గతం పలికారు. బాణసంచా, తీన్మార్‌ డప్పుల మధ్య ఊరేగింపుగా పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ముందుగా షర్మిల పార్టీ కార్యాలయం లోని మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా షర్మి ల మాట్లాడుతూ చం ద్రబాబు సూపర్‌సిక్స్‌ లో అన్నదాతా సుఖీభ వ.. కాస్తా..ఇవాళ పేప రులోఅన్నదాతా దుఃఖీ భవగా మారిందన్నారు. సగం మంది రైతులకే అన్నదాతా సుఖీభవ ఇస్తామని చెప్పడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. తల్లికి వంద నం పేరుతో వేస్తామన్న డబ్బులు సాగదీసి ఒక ఏడాది ఎగ్గొట్టి.. కొందరికి ఇవ్వకపోవడం మోసమేనని మండిపడ్డారు. కర్ణాటక, తెలంగాణ రాషా్ట్ర ల్లో మహిళలకు ఉచిత బస్సు పథకా న్ని బ్రహ్మాండంగా అమలు చేస్తుంటే.. మన రాష్ట్రం లో మహిళలు ఈ పథకానికి నోచుకోలేదన్నారు. కరెంటు చార్జీలు అధికారంలోకి వచ్చిన వెం టనే 30శాతం తగ్గిస్తామని చెప్పి పెంచేశారన్నారు. వీటన్నింటిపై ప్రశ్నించాల్సిన అవసరం అందరికీ ఉందని, నిజా యితీగా ప్రజలపక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తు న్నారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రం లో కాంగ్రెస్‌ అఽధికారంలోకి రావడం ఖాయమని షర్మిల అన్నారు. ఈ సందర్భంగా షర్మిల మా ట్లాడుతూ రానున్న నాలుగేళ్లలో రాష్ట్రంలోను కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కానుందన్నారు. చిన్న పాటి అభిప్రాయ భేదాలున్నా పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సమా వేశంలో ఏఐసీసీ సభ్యుడు, పీసీసీ ప్రధాన కార్య దర్శి మల్లిపూడి రాంబాబు, పీసీసీ ఉపాధ్యక్షుడు మట్టా శివప్రసాద్‌, సీనియర్‌ నాయకుడు మా ర్టిన లూధర్‌, నియోజకవర్గ ఇనచార్జిలు మారోతి శివగణేష్‌, నీరుకొండ సత్యనారాయణ పిల్లి సత్య లక్ష్మి చిన్న, పీసీసీ సభ్యుడు పోలిశెట్టి శ్రీనివాస రావు, జిల్లా ఉపాధ్యక్షులు పబ్డినీడి కృష్ణ, దవు లూరి ధనకోటి, జిల్లా ఎస్సీ సెల్‌ చైర్మన మొయ్యే టి సూర్యప్రకాష్‌, జిల్లా ఐఎనటీయూసీ అధ్యక్షు డు తాళ్లూరి రాజు, సిటీ మాజీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు పాల్గొన్నారు. కాకినాడ రూరల్‌ ఇనచార్జి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకో వడం లేదని ఇంట్లో కూర్చుని కార్యక్రమాలు చేసినట్లు ఫొటోలు పంపిస్తున్నారని రూరల్‌ నాయకుడు, పీసీసీ సభ్యుడు పోలిశెట్టి శ్రీనివాస రావు ఫిర్యాదు చేశారు.

Updated Date - Jun 29 , 2025 | 12:51 AM