ఆత్మలకు రేషన్!
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:58 AM
భూమ్మీ దే లేరు. మరి వీరు ఎలా రేషన్ తీసుకుంటున్నారబ్బా!, కొంపదీసి ఆత్మలేమైనా వచ్చి వేలిముద్రలేసి సరుకులు తీసుకుపోతున్నాయా? లేకుంటే.. జంతర్‌మంతర్ మోళీ జరుగుతోందా? అసలు ఈ సరుకులు ఎవరు తీసుకుంటున్నా రు? చనిపోయిన వారి పేరున ఎలా తీసుకుంటున్నారు? నిరుపేదలకు అందాల్సిన బియ్యాన్ని ‘బియ్యామ్.. బియ్యామ్’ అంటూ బొక్కేస్తున్నది ఎవరు? తెలుసుకోవాలని ఉందా? చదివేయండి మరి..
మరణించిన వారి పేరున రేషన్
అంత్యోదయ అన్నయోజన కార్డుల్లో మాయాజాలం
పేరు: పంపన లక్ష్మి, ఇంద్రపాలెం
అంత్యోదయ రేషన్‌కార్డు నెంబర్: వైఏపీ042300500460
నెలకు 35 కిలోల రేషన్ బియ్యం అందుతాయి.
మరణించిన తేదీ: 8.9.2015
అందరికీ దూరమై సుమారు పదేళ్లు కావొస్తున్నా.. ఆమె పేరున రేషన్ తీసుకుంటున్నట్టుగా రికార్డుల్లో నమోదవుతోంది. ఏప్రిల్ 15న 0423006 నెంబరు గల రేషన్‌షాపు నుంచి, మే 11న 0423034 నెంబర్ గల రేషన్ దుకాణం నుంచి, జూన్ 6న, గతనెల 0423034 నెంబరుగల రేషన్ దుకాణంనుంచి సరుకులు తీసుకున్నట్టు ఉంది.
పేరు: పాలెపు వీరమ్మ, వలసపాకల
అంత్యోదయ రేషన్‌కార్డు నెంబర్: వైఏపీ042302601039
నెలకు 35 కిలోల రేషన్ బియ్యం అందిస్తారు.
మరణించిన తేదీ: 7.1.2025
మరణించి 8నెలలైంది. అయినా ఆమె తనకు వచ్చే 35 కిలోల బియ్యం, రెండు కిలోల పంచదార రేషన్ తీసుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీన 0423006 నంబరు గల రేషన్ దుకాణం నుంచి, మే 11న 0423034 నంబరు గల రేషన్ దుకాణం నుంచి, అదే షాపు నుంచి జూన్ 10వ తేదీన బియ్యం, పంచదార సరుకులు అందుకున్నట్టుగా రికార్డుల్లో ఉంది.
పేరు: పోలవరపు వెంకయమ్మ, తూరంగి
అంత్యోదయ రేషన్ కార్డు నెంబర్: వైఏపీ042301100020
నెలకి 35 కిలోల బియ్యం, రెండు కిలోల పంచదార సరఫరా చేస్తారు.
మరణించిన తేదీ: 27.7.2024
మృతి చెంది ఏడాదైంది. అయినా నెలనెలా వచ్చే రేషన్ షాపులను తీసుకుంటోంది. ఏప్రిల్ 15న 0423006 నెంబరు గల రేషన్ దుకాణం నుంచి, మే 11వ తేదీన 0423034 నంబరు గల దుకాణం నుంచి, జూన్ 12వ తేదీన కూడా అదే నెలలో రేషన్ సరుకులు తీసుకుంది.
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
ఇదేంటీ..వీరందరూ మరణించారు... భూమ్మీ దే లేరు. మరి వీరు ఎలా రేషన్ తీసుకుంటున్నారబ్బా!, కొంపదీసి ఆత్మలేమైనా వచ్చి వేలిముద్రలేసి సరుకులు తీసుకుపోతున్నాయా? లేకుంటే.. జంతర్‌మంతర్ మోళీ జరుగుతోందా? అసలు ఈ సరుకులు ఎవరు తీసుకుంటున్నా రు? చనిపోయిన వారి పేరున ఎలా తీసుకుంటున్నారు? నిరుపేదలకు అందాల్సిన బియ్యాన్ని ‘బియ్యామ్.. బియ్యామ్’ అంటూ బొక్కేస్తున్నది ఎవరు? తెలుసుకోవాలని ఉందా? చదివేయండి మరి.. వితంతువులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వికలాంగులు, 60ఏళ్లు అంత కంటే ఎక్కువ వయస్సువారు,సంవత్సరాదాయం రూ.15వేలు ఉన్న వారందరికీ ప్రభుత్వం ఈ కా ర్డులు అందిస్తుంది. ఈ కార్డు ద్వారా వీరికి నెల కు 35 కిలోల ఉచిత బియ్యంతోపాటు రెండు కిలోల పంచదార వంటి నిత్యావసర వస్తువులు అందిస్తుంటారు. వీరిలో వితంతువులు, ఒంటరి మహిళలు అధికంగా ఉంటారు. కూటమి వ చ్చాక ఇలాంటి వారికి ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందజేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 38వేల అంత్యోదయ అన్నయోజన కార్డుదారులున్నారు. వీరిలో వయసు మీరి కొం దరు, అనారోగ్యంతో కొందరు మరణించారు.
బియ్యాన్ని బొక్కేస్తున్నారు
శవాలపై మరమరాలు ఏరుకునే బ్యాచ్ మా దిరిగా.. కాకినాడలో చనిపోయిన వారి అంత్యో దయ కార్డుదారుల పేర్లతో కొందరు నెలనెలా 35కిలోల బియ్యాన్ని బొక్కేస్తున్నట్టుగా తేలింది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని పలువురు రేషన్‌డీలర్లు ఈ అక్రమాలకు పెద్దఎత్తున పాల్ప డుతున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. వీరికి కొం దరు వీఆర్వోలు, సివిల్ స్లప్లయీస్ కార్పొరేషన్ సిబ్బంది సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాకినాడ రూరల్ పరిధిలో అంత్యోదయ కార్డులు ఉ న్న కొందరు వివిధ కారణాలతో కా లం చేశారు. వాస్తవానికివీరిలో ఎక్కువమంది ఒంటరి మహి ళలే.. ఇలాంటి వారికార్డులను తమ వద్ద ఉంచు కుని కొందరు డీలర్లు నెలనెలా వారికి వచ్చే 35 కిలోల ఉచిత బియ్యాన్ని నొక్కేస్తున్నారు. ఈ తతంగం చాలారోజులుగా సాగుతోంది. ఇలాంటి కార్డులకు రేషన్ బియ్యం ఇవ్వాలంటే కచ్చితంగా వీఆర్‌ఓ లేదా సచివాలయ సిబ్బంది వేలిముద్రలు వేయాలి. అప్పుడే కార్దుదారుడి డేటా కనిపిస్తుంది. వేలిముద్ర, ఐరిష్ క్యాప్చరింగ్ కానిదే బియ్యపు గింజ కూడా బయటకు రాదు.
కొన్ని నెలలుగా..
రేషన్‌సరుకులు అర్హులకు మాత్రమే అందాలి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సరుకుల పంపిణీలో గోల్‌మాల్ జరుగుతోంది. జిల్లాలో రేషన్ లబ్ధిదారుల్లో మృతులు ఉన్నారంటే ఆశ్చర్యం ప డాల్సిన పరిస్థితే లేదు. ఇందులో ఈకేవైసీ ప్రక్రి యను అధికారులు ప్రహసనంగా మార్చేశారు. ఇదే అవకాశంగా కొందరు డీలర్లు సరుకులను పక్కదారి పట్టిస్తున్నారు. అలాంటి సంఘటనలు కాకినాడ రూరల్ మండలంలోని కొన్ని షాపుల్లో అనేకం జరిగినట్టు ఆధారాలు బయటపడ్డాయి. సుమారు ఏడు నెలల నుంచి ఏడాది మధ్య కాలంలో మరణించిన పలువురు కార్దుదారుల పేరుతో కాకినాడ రూరల్ మండలంలోని షాపు నెం: 0423006, 0423034 నెంబర్లు గల రెండు రేషన్ దుకాణాల నుంచి చనిపోయిన వారి కార్డు నెంబర్లతో సరుకులు తీసుకువెళ్లినట్టుగా తేలింది. జిల్లాలోని కాకినాడ అర్బన్, పిఠాపురం, ఏలేశ్వరం, తాళ్లరేవు, రాజమండ్రి, గండేపల్లితోపా టు అనకాపల్లి జిల్లాకు చెందిన అంత్యోదయ కార్డు లబ్ధిదారులు సైతం ఈ రెండు రేషన్ షాపుల నుంచే నెలనెలా అందించే 35 కిలోల ఉచిత రేషన్ బియ్యాన్ని తీసుకువెళ్లడం విశేషం.
అంతా అక్కడి నుంచేనా..
ఈ మొత్తం వ్యవహారంలో రేషన్ డీలర్లు, ఎం ఎస్‌ఓలు, వీఆర్‌ఓలు, సచివాలయ సిబ్బంది ప్ర మేయం కచ్చితంగా ఉండే అవకాశం ఉందంటు న్నారు. వీరిందరూ ఓపక్క ప్రణాళికతోనే ఇలాం టి అక్రమ దందాలను, దోపిడీలను నిర్వహిస్తున్నట్టుగా అర్థమవుతోంది. జిల్లాలో 1060 రేషన్ దుకాణాలు ఉండగా.. అంత్యోదయ కార్డులు ఉం డగా.. ఎక్కడో కాకినాడ రూరల్ మండలంలోని రెండు దుకాణాలకు మాత్రమే వచ్చి ఎందుకు సరుకులు తీసుకుంటున్నారో ఆ సివిల్ సప్లయీ స్ అధికారులే నిగ్గుతేల్చాలి. ఈ బాగోతంలో ఆ విభాగానికి సంబంధించిన ఓకీలక ఉద్యోగికూడా చేతులు కలిపారనే ప్రచారం ఉంది. డీఎస్‌ఓ తర్వాత ఆ స్థాయిలో ఈ పోస్ మెషీన్ల పాస్‌వర్డ్‌లు తెలిసిన ఆ ఉద్యోగి ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. అతడే ఇలాంటి కార్డులన్నింటిని పోగేసి.. తమ కు అనుకూలంగా ఉన్న డీలర్లకు అప్పగిస్తూ.. రేషన్ బియ్యం దోపిడీకి సహకరిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక్కడ మాత్రమే కాదు.. జిల్లా అంతటా ఇలాంటి అక్రమాలు జ రుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.