Share News

శుభ ముహూర్తం ఖరారు...

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:26 AM

అంతర్వేది, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక దివ్య, తిరు కల్యాణ మహోత్సవాలకు శుభ ముహూర్తం ఖరారైంది. తొలుత అర్చకులు, స్థానాచార్యులు, వేదపండితులు ఆలయ సహాయ కమిషనర్‌ ఎంకేటీఎన్వీ ప్రసాద్‌కు ముహూర్తపు పత్రికను ఆదివారం అందించారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి.

శుభ ముహూర్తం ఖరారు...
శ్రీలక్ష్మీనరసింహస్వామి

జనవరి 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు అంతర్వేదిలో వార్షిక కల్యాణోత్సవాలు

అంతర్వేది, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక దివ్య, తిరు కల్యాణ మహోత్సవాలకు శుభ ముహూర్తం ఖరారైంది. తొలుత అర్చకులు, స్థానాచార్యులు, వేదపండితులు ఆలయ సహాయ కమిషనర్‌ ఎంకేటీఎన్వీ ప్రసాద్‌కు ముహూర్తపు పత్రికను ఆదివారం అందించారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ముహూర్త నిర్ణయం ప్రకారం.. 28న రథ సప్తమి పర్వదినం రోజున మొదలుకుని రాత్రి 1.56 గంటలకు స్వామివారి కల్యాణం, 29న గురువారం మధ్యాహ్నం 2.05 గంటలకు స్వామివారి రథోత్సవం, 1న ఆదివారం ఉదయం 8గంటలకు స్వామివారి చక్రస్నానం (సముద్రస్నానం), 2న సాయంత్రం 6 గంటలకు స్వామివారి తెప్పోత్సవం జరుగుతాయి. మాఘమాసంలో జరిగే స్వామివారి కల్యాణోత్సవాల్లో 9రోజులు స్వామివారు ఒక్కో వాహనంపై గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం (వాహనసేవ) జరుగుతుంది. స్వామివారి దివ్య తిరు కల్యాణ మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లలో భాగంగా వివిధ శాఖల అధికారులతో అమలాపురం ఆర్డీవో కె.మాధవి అధ్యక్షతన డిసెంబరు 4న ఉదయం 11 గంటలకు సమీక్షా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ఆలయ సహాయ కమిషనర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 12:26 AM