Share News

అంతర్వేది హుండీల ఆదాయం రూ.44.20 లక్షలు

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:48 AM

అంతర్వేది, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మం డలం అంతర్వేదిలో కొలువై ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో

అంతర్వేది హుండీల ఆదాయం రూ.44.20 లక్షలు
స్వామివారి హుండీల్లో కానుకలను లెక్కిస్తున్న సిబ్బంది

అంతర్వేది, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మం డలం అంతర్వేదిలో కొలువై ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి హుండీల ఆదాయాన్ని లెక్కించారు. డీఈవో వి.సత్యనారాయణ పర్యవేక్షణలో 87 రోజులకుగాను ప్రధాన ఆలయ హుండీ ద్వారా రూ.42,44,077, గుర్రాలక్కమ్మ హుండీ ద్వారా రూ.19, 824, అన్నదాన హుండీ ద్వారా రూ.1,56,596 వెరసి మొత్తం రూ.44,20, 491 ఆదాయంతో పలు దేశాల విదేశీ కరెన్సీ, 126. 46 గ్రాముల వెండి వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్‌ ఎంకేటీఎన్వీ ప్రసాద్‌ పేర్కొ న్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 12:48 AM