Share News

సత్యదేవా.. సంఖ్య తగ్గే!

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:34 AM

అన్నవరం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో ఏటా కార్తీమాసంలో అధికసంఖ్యలో వ్రతాలు జరుగుతుంటాయి. అయితే ఈసారి మాత్రం ఆ సంఖ్య భారీగా తగ్గనుంది. తెలుగురాష్ట్రాల నుం చే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వి చ్చేసి కార్తీకమాసంలో

సత్యదేవా.. సంఖ్య తగ్గే!
సత్యదేవుడి వ్రతాలు ఆచరిస్తున్న భక్తులు (ఫైల్‌)

గతేడాది కార్తీకం కంటే ఈ ఏడాది తగ్గనున్న సత్యదేవుడి వ్రతాలు

తుఫాన్‌ ప్రభావంతో సుమారు 10 వేల వ్రతాల్లో కోత

నేటితో ముగియనున్న కార్తీకమాసం

అన్నవరం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో ఏటా కార్తీమాసంలో అధికసంఖ్యలో వ్రతాలు జరుగుతుంటాయి. అయితే ఈసారి మాత్రం ఆ సంఖ్య భారీగా తగ్గనుంది. తెలుగురాష్ట్రాల నుం చే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వి చ్చేసి కార్తీకమాసంలో సత్యదేవుడి వ్రతాలు ఆచ రిస్తారు. ఏడాదిలో జరిగే వ్రతాల్లో సుమారు 20 శాతం కార్తీకమాసంలో జరుగుతుండడం విశే షం. గతేడాది కార్తీకమాసంలో 1,45,732 వ్రతా లు జరగగా ఈ ఏడాది 1.50 లక్షలు జరుగుతాయని అధికారులు అంచనా వేశారు. గురువారంతో కార్తీకమాసం ముగియనుండగా బుధవారంతో 133644 వ్రతాలు జరగగా గతేడాది కంటే 12088 వ్రతాల లోటులో ఉంది. గురువారం అమావాస్య కారణంగా కేవలం 2వేల వ్రతాలు జరి గే అవకాశాలు ఉన్నాయి. మొత్తంమీద గతేడాది కంటే సుమారు 10 వేల వ్రతాల లోటు కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం కార్తీకమాసం ప్రారంభంలో మెంథా తుఫాన్‌ ప్రభా వం పడింది. ఈ తుఫాన్‌ భయంకరంగా ఉంటు ందని, కాకినాడ ప్రాంతంలో తీరం దాటుతుందని హెచ్చరికల నేపథ్యంలో భక్తులు వెనకడుగు వేశారు. ఆ సమయంలో భక్తులు పూర్తిస్థాయిలో వచ్చి ఉంటే 1.50 లక్షలు వ్రతాలు జరిగి గతేడాది రికార్డును అధిగమించే అవకాశం ఉండేది. కానీ అలా జరగకుండా వ్రతాల సంఖ్య తగ్గింది.

Updated Date - Nov 20 , 2025 | 12:34 AM