అంతా ఆన్‌లైన్..
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:02 AM
అన్నవరం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో భక్తు లు గంటలతరబడి క్యూలైన్‌లలో నిరీక్షణ లేకుండా సేవలన్నింటికీ ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు పొందవచ్చని ఈవో వీర్ల సుబ్బారావు తెలిపారు. వ్రతం టిక్కెట్లు, వసతిగదులు, దర్శనాలు, ప్రసాదాల కొనుగోలు వీటన్నింటికీ ప్ర
సత్యదేవుడి సన్నిధిలో భక్తుల సౌలభ్యం కోసం అన్నిసేవలు, ప్రసాదాలకు ఆన్‌లైన్ సౌకర్యం
ఏపీటెంపుల్స్.ఓఆర్‌జీ వెబ్‌సైట్ లేదా మనమిత్ర వాట్సాప్ 9552300009 ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం
ఈవో వీర్ల సుబ్బారావు
అన్నవరం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో భక్తు లు గంటలతరబడి క్యూలైన్‌లలో నిరీక్షణ లేకుండా సేవలన్నింటికీ ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు పొందవచ్చని ఈవో వీర్ల సుబ్బారావు తెలిపారు. వ్రతం టిక్కెట్లు, వసతిగదులు, దర్శనాలు, ప్రసాదాల కొనుగోలు వీటన్నింటికీ ప్రభుత్వ ఆదేశాలు, దేవదాయశాఖ సూచనలతో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. భక్తులు ఆన్‌లైన్ టిక్కెట్లను ఏపీటెంపుల్స్.ఓఆర్‌జీ వెబ్‌సైట్ లేదా మనమిత్ర వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా బుక్‌చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా గోశాల, అన్నదానట్రస్ట్‌లకు విరాళాలు అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులు, అన్నిరకాలైన యూపీఐ పేమెంట్ల ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎటువంటి నిరీక్షణ లేకుండా సంతృప్తిగా దర్శనం పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతీ భక్తుడు సద్వినియోగం చేసుకోవాలని ఈవో సుబ్బారావు కోరారు