నేడు సత్యదేవుడి తెప్పోత్సవం
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:56 AM
అన్నవరం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): సత్యదేవుడికి ప్రతిఏటా నిర్వ హించే కీలకమైన ఉత్సవాల్లో ఒక్కటైన తెప్పోత్సవానికి ఆలయ యంత్రా ంగం సర్వం సిద్ధం చేసింది. ఆదివారం రాత్రి 7గంటలకు స్వామి,అమ్మవార్లు పంపా సరోవరంలో నౌకావిహారయాత్ర చేయనున్నా
సాయంత్రం 5.45కి తులసి ధాత్రి పూజ, రాత్రి 7గంటలకు నౌకావిహారం
అన్నవరం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): సత్యదేవుడికి ప్రతిఏటా నిర్వ హించే కీలకమైన ఉత్సవాల్లో ఒక్కటైన తెప్పోత్సవానికి ఆలయ యంత్రా ంగం సర్వం సిద్ధం చేసింది. ఆదివారం రాత్రి 7గంటలకు స్వామి,అమ్మవార్లు పంపా సరోవరంలో నౌకావిహారయాత్ర చేయనున్నారు. ఇప్పటికే రంగురంగుల విద్యుద్దీపఅలంకరణలు ఏర్పాటు చేశారు. వేలాదిగా భక్తు లు తిలకించేందుకు వీలుగా ప్రత్యేక వేదికను తీర్చిదిద్దారు. ప్రముఖులు వీక్షించేందుకు ప్రత్యేక వీఐపీ గ్యాలరీ, ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. స్వామి,అమ్మవార్లను ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు కొండపై నుంచి మేళతాళాలతో పల్లకీలో పంపా సరోవర తీరం వద్దకు తీసుకువస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆశీనులు గావించి అలంకరణ అనంతరం 5.45 గంటలకు తులసిధాత్రి పూజను నిర్వహించి 7గంటలకు నౌకావిహార యాత్రను నిర్వహిస్తారు. పెద్దాపురం డీఎస్పీ పర్యవేక్షణలో 100మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.