Share News

నేత్రపర్వం... సత్యదేవుడి శ్రీ పుష్పయాగం

ABN , Publish Date - May 14 , 2025 | 12:21 AM

అన్నవరం, మే 13 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి దివ్య కల్యాణోత్సవాల్లో భాగంగా చివరిరోజైన మంగళవారం శ్రీ పుష్పయాగం నేత్రపర్వంగా జరిగింది. రాత్రి 7.30కి నవదంపతులైన సత్యదేవుడు, అనం తలక్ష్మి అమ్మవార్లను, పెళ్లి పెద్దలైన సీతారాములను మంగళవాయిద్యాల నడుమ వేడుక

నేత్రపర్వం... సత్యదేవుడి శ్రీ పుష్పయాగం
పుష్పాలతో తీర్చిదిద్దిన ఊగుటూయలలో విష్ణుమూర్తిగా సత్యదేవుడు, మహాలక్ష్మిగా అనంతలక్ష్మి

పలు జాతుల సుగంధభరిత పుష్పాలతో అర్చన

విశేష పదార్థాలు, మధురఫలాలు నివేదన

ముగిసిన దివ్య కల్యాణోత్సవాలు

అన్నవరం, మే 13 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి దివ్య కల్యాణోత్సవాల్లో భాగంగా చివరిరోజైన మంగళవారం శ్రీ పుష్పయాగం నేత్రపర్వంగా జరిగింది. రాత్రి 7.30కి నవదంపతులైన సత్యదేవుడు, అనం తలక్ష్మి అమ్మవార్లను, పెళ్లి పెద్దలైన సీతారాములను మంగళవాయిద్యాల నడుమ వేడుక జరిగే నిత్య కల్యాణమండపం వద్దకు తోడ్కొనివచ్చారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేర్వేరు వేదికలపై ఆశీ నులు గావించి ప్రదానార్చకులు కోట సుబ్రహ్మ ణ్య ం, ఇంద్రగంటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో రుత్విక్‌లు గణపతిపూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నవదంపతులను వివిధ సుగందభరిత పుష్పాలతో తీర్చిదిద్దిన ఊగుటూయలలో శేషపాన్పుపై పవళించే విష్ణుమూర్తిగా సత్యదేవుడను, ఆయన పాదాలు సుతిమెత్తగా ఒత్తుతున్న దేవిగా అమ్మవారిని అలంకరించి వేడుక కోసం తీసుకొచ్చిన వివిధ జాతుల పుష్పాలతో అష్టోత్తర శతసహస్ర నామాలతో అర్చకస్వాములు అర్చించారు. ఈ సందర్భంగా వివిధ రకాలైన తీపిపదార్థాలు, మదురఫలాలను నివేదించా రు. చతుర్వేదపండితుల వేదాశీర్వచనాలు అందిం చారు. భక్తులు ఈ వేడుకను ఊగుటూయలకు ఎదురుగా ఏర్పాటుచేసిన అద్దంలో వీక్షించి పునీతులయ్యారు. అనంతరం దంపతులకు దంపతీతాంబూలాలు కార్యక్రమానికి హాజరైన మహిళా భక్తులకు రవికవస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్‌ రోహిత్‌ పాల్గొన్నా రు. వైదిక కార్యక్రమాలను ఇంద్రగంటి సుధీర్‌, ఇంద్రగంటి వెంకటేశ్వర్లు, చామర్తి కన్నబాబు, పాలంకి చినపట్టాభి నిర్వహించారు. అన్నవరం పరిసర ప్రాంతాల నుంచి వందలాది మహిళలు హాజరయ్యారు. ఈ వేడుకతో సత్యదేవుని విశ్వావసు నామసంవత్సర కల్యాణోత్సవాలుముగిశాయి.

‘సురుచి’ మిఠాయిలు

మండపేట, మే 13(ఆంధ్రజ్యోతి): అన్నవరం సత్యదేవుడి శ్రీపుష్పయాగా నికి కోనసీమ జిల్లా తాపేశ్వరం సురుచి మిఠాయిల తయారీసంస్థ 9రకాల మిఠా యిలను అందజేసినట్టు సంస్థ యాజ మాని పోలిశెట్టిమల్లి ఖార్జునరావు (మ ల్లిబాబు) తెలిపారు. తాపేశ్వరంలో మి ఠాయిలకు ప్రత్యేక పూజలు అనంతరం అన్నవరానికి తీసు కెళ్లారు. గత ఐదేళ్ల నుంచి స్వామికి మిఠాయి ప్రసాదాన్ని అందిస్తున్నామని మల్లిబాబు చెప్పారు.

Updated Date - May 14 , 2025 | 12:21 AM