Share News

భక్తులకు అసౌకర్యం కలగకూడదు

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:31 AM

అన్నవరం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ప్రధానాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించిన నేపథ్యంలో అన్నవరం దేవస్థానం ప్రత్యేకాధికారిగా నియమితులైన వేండ్ర త్రినాధరావు మంగళవారం ఆల యంలో అవుట్‌డోర్‌ పాయింట్లను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌ

భక్తులకు అసౌకర్యం కలగకూడదు
ఆలయ పరిసరాలు పరిశీలిస్తున్న త్రినాధరావు

అన్నవరం దేవస్థానంలో ప్రత్యేకాధికారి పరిశీలన

అన్నవరం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ప్రధానాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించిన నేపథ్యంలో అన్నవరం దేవస్థానం ప్రత్యేకాధికారిగా నియమితులైన వేండ్ర త్రినాధరావు మంగళవారం ఆల యంలో అవుట్‌డోర్‌ పాయింట్లను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. వారి కోసం ఏర్పాటుచేసిన మరుగుదొడ్లను ఆధునికీకరించాల్సి ఆవశ్యకత ఉందని సూచించారు. నిత్యకల్యాణమండపం పక్కన దాత సహాయంతో ఏర్పాటుచేసిన మరుగుదొడ్డు మాదిరి మిగిలిన ప్రదేశాల్లో దశలవారీగా ఏర్పాటు చేయాలన్నారు. దీనికి సంబంధించి త్వరలో ప్రత్యేక గైడ్‌లైన్స్‌ అందజేయడం జరుగుతుందని దానికణుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. దేవదాయ కమిషనర్‌, ప్రి న్స్‌పాల్‌ ఆదేశాలతో ఒక ప్రోఫార్మ ప్రకారం నడుచుకోవాల న్నారు. తనిఖీల సమయంలో ఇచ్చినసూచనలు సంబంధిత అధి కారులు ఎంతవరకు పూర్తిచేశారో తమకు అందజేస్తే వాటిని దేవదాయశాఖ ప్రధాన కార్యాలయానికి నివేదిక రూపంలో అందజేస్తామన్నారు. ప్రతి 15రోజులకు ఒకసారి విజిట్‌ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఈవో వీర్ల సుబ్బారావు, ఈఈ రామకృష్ణ, ఏఈవో ఎల్‌ శ్రీనివాస్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరరావు ఉన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 12:31 AM