Share News

భక్తిశ్రద్ధలతో సత్యదీక్షల స్వీకరణ

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:13 AM

అన్నవరం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధి శుక్రవారం పసుపుదళంతో శోభసంతరించుకుంది. స్వామివారికి అత్యంత ఇష్టమైన సత్యదీక్షలు స్వీకరించే ప్రత్యేకరోజు కావడంతో అధికసంఖ్యలో భక్తులు సత్యదీక్షలు స్వీకరించారు. అన్నవరం పరిసర ప్రాంతాలు వివిధ ప్రాంతాల్లో సు

భక్తిశ్రద్ధలతో సత్యదీక్షల స్వీకరణ
సత్యదీక్షలు స్వీకరించి పూజల్లో పాల్గొన్న దీక్షాపరులు

అన్నవరం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధి శుక్రవారం పసుపుదళంతో శోభసంతరించుకుంది. స్వామివారికి అత్యంత ఇష్టమైన సత్యదీక్షలు స్వీకరించే ప్రత్యేకరోజు కావడంతో అధికసంఖ్యలో భక్తులు సత్యదీక్షలు స్వీకరించారు. అన్నవరం పరిసర ప్రాంతాలు వివిధ ప్రాంతాల్లో సుమారు 3వేలమ ంది సత్యదీక్షలు స్వీకరించినట్టు అధికారులు తెలిపారు. ప్రతీఏటా ఆశ్వీయుజ మాసంలో వచ్చే మఖనక్షత్రం రోజున ఈ దీక్షలు స్వీకరించి కార్తీకమాసంలో వచ్చే మఖ నక్షత్రంతో సత్యదీక్షావిరమణ జరుగుతుంది. రత్నగిరి పై స్వామివారి వార్షిక కల్యాణమండపంలో దీక్షాపరులు గురుస్వాములు, అర్చకస్వాములు చేతులమీదుగా దీక్షలు స్వీకరించారు. సత్యదీక్షల ప్రచారకర్త నల్లమిల్ల కృష్ణబాబు ఆధ్వర్యంలో జగ్గంపేట, ఏలేశ్వరం, కిర్లంపూడి, ప్రత్తిపాడు మండలలలో సుమారు వెయ్యిమంది సత్యదీక్షలు స్వీకరించారు.

సత్యదేవుడికి జన్మనక్షత్రపూజలు

స్వామి జన్మనక్షత్రం మఖ సందర్భంగా ప్రధానాలయంలో మూలవిరాట్‌లకు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున 2గంటలకు స్వామి,అమ్మవార్లను సుప్రభాతసేవతో మేల్కొలిపి అభ్యంగనస్నానమాచరింప చే శారు. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించి పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం పట్టువస్త్రాలను ధరింపచేశారు. ప్రత్యేక పుష్పాలంకరణలో స్వామి, అమ్మవార్లు దర్శనమిచ్చారు.

ఘనంగా చండీహోమం

రత్నగిర క్షేత్రరక్షకి వనదుర్గ ఆలయంలో శుక్రవారం చండీహోమం ఘనంగా జరిగింది. ఉద యం 10గంటలకు గణపతిపూజతో అర్చకస్వాములు కార్యక్రమం ప్రారంబించారు. అమ్మవారికి చండీ,సప్తసతి పారాయణలు, మూలమంత్రజపములు పఠించారు. 11 గం టలకు పవిత్ర హోమగుండం లో సుగంధద్రవ్యాలను అర్పి ంచి పూర్ణాహుతి గా వించారు. చ తుర్వేదపండితుల వేదాశీర్వచనాలు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

Updated Date - Oct 18 , 2025 | 12:13 AM