Share News

విజయవాడ దుర్గమ్మకు అన్నవరం తరుపున సారె, చీర

ABN , Publish Date - Jun 28 , 2025 | 12:23 AM

అన్నవరం, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): అన్నవరం సత్యదేవుడి సోదరిగా విరాజిల్లుతున్న విజయవాడ కనకదుర్గకు శుక్రవారం అన్నవరం దేవస్థానం తరుపున ఈవో

విజయవాడ దుర్గమ్మకు అన్నవరం తరుపున సారె, చీర
విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఆషాఢం సారెను తీసుకెళ్తున్న అన్నవరం ఆలయ ఈవో దంపతులు

అన్నవరం, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): అన్నవరం సత్యదేవుడి సోదరిగా విరాజిల్లుతున్న విజయవాడ కనకదుర్గకు శుక్రవారం అన్నవరం దేవస్థానం తరుపున ఈవో సుబ్బారావు దంపతులు ఆషాఢం సారె, చీరలను అందించారు. ఈ సందర్భంగా అన్నవరం దేవస్థానం నుంచి వెళ్లిన పండితులకు, అధికారులకు అక్కడ ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. సత్యదేవుడి కల్యాణోత్సవాలకు విజయవాడ దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు, దసరా నవరాత్రులలో అన్నవరం దేవస్థానం నుంచి అక్కడికి పట్టువస్త్రాలను పట్టుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది.

Updated Date - Jun 28 , 2025 | 12:23 AM