Share News

కిక్కిరిసిన సత్యదేవుడి సన్నిధి

ABN , Publish Date - Nov 10 , 2025 | 12:53 AM

అన్నవరం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధి ఆదివారం భక్తజనసందోహంగా మారింది. వేకువజామున 2గంటల నుంచి సర్వదర్శనాలు, వ్రతాలు ప్రారంభించగా సాయంత్రం 4 గంటల వరకు నిరంతరాయం గా రద్దీ కొనసాగింది. ఒక దశలో క్యూలైన్లు, వ్రతమండపాలు కిక్కిరిసి నిండిపోవడంతో అధికారులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్ప డింది. వాహనాల

కిక్కిరిసిన సత్యదేవుడి సన్నిధి
క్యూలో బారులు తీరి సత్యదేవుడి దర్శనానంతరం వస్తున్న భక్తులు

భారీగా తరలివచ్చిన భక్తులు

9వేల వ్రతాలు

రూ.85 లక్షల ఆదాయం

అన్నవరం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధి ఆదివారం భక్తజనసందోహంగా మారింది. వేకువజామున 2గంటల నుంచి సర్వదర్శనాలు, వ్రతాలు ప్రారంభించగా సాయంత్రం 4 గంటల వరకు నిరంతరాయం గా రద్దీ కొనసాగింది. ఒక దశలో క్యూలైన్లు, వ్రతమండపాలు కిక్కిరిసి నిండిపోవడంతో అధికారులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్ప డింది. వాహనాల పార్కి ంగ్‌తో గందరగోళ పరిస్థితులు రావడంతో ఎస్‌ఐ హరిబాబు కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలను కొండదిగువ కళాశాల మైదానంలో పార్కింగ్‌ చేయించి కొండదిగువ నుంచి ఉచిత బస్సుసౌకర్యం కల్పించారు. సుమారు 90వేలమందిని స్వామిని దర్శించుకోగా సత్యదేవ నిత్యన్నదాన పథకం ద్వారా 25వేలమందికి ఉచిత పులిహోర పంపిణీ చేశారు. స్వామివారి ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, ఉచిత దర్శనానికి 3గంటల సమయం భక్తులు వేచిఉండాల్సి వచ్చింది. చైర్మన్‌ రోహిత్‌ దగ్గరుండి ఎటువంటి తోపులాటలు జరగకుండా పర్యవేక్షించారు. ఆదివారం ఒక్కరోజు 9వేల జంటలు సత్యదేవుడి వ్రతాలు ఆచరించుకోగా వివిధ విభాగాల ద్వారా సుమారు రూ.85 లక్షలు ఆదాయం లభించింది. భక్తుల రద్దీతో అంత్రాలయం దర్శనం టిక్కెట్ల విక్రయాలు నిలుపుదల చేసి శీఘ్రదర్శనానికి పరిమితం చేశారు. దిగువభాగంలో ఉన్న యంత్రాలయం సాయంత్రం వరకు పూర్తిగా నిలిపివేశారు. ఈవో సుబ్బారావు సత్యగిరికొండ, వ్రత మండపాలలో తిరుగుతూ కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షించారు. కాగా రత్నగిరిపై కార్తీక సోమవారం జరిగే కార్య క్రమాలకు హాజరయ్యేందుకు ఆదివారం రాత్రే భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. వసతి గదులు సరిపడక ఆరుబయట విశ్రమించారు.

Updated Date - Nov 10 , 2025 | 12:53 AM