రత్నగిరిపై భక్తుల సందడి
ABN , Publish Date - May 25 , 2025 | 12:49 AM
అన్నవరం, మే 24 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధి శనివా రం భక్తులతో పోటెత్తింది. వైశాఖమాసం వివాహ ముహూర్తాల్లో శుక్రవారం చివరి ము
రూ.50 లక్షల ఆదాయం
అన్నవరం, మే 24 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధి శనివా రం భక్తులతో పోటెత్తింది. వైశాఖమాసం వివాహ ముహూర్తాల్లో శుక్రవారం చివరి ముహూర్తం కావడంతో సత్యదేవుడి సన్నిధిలో వివాహం చేసుకున్న జంటలతో పా టుగా వివిధ ప్రాంతాల్లో ఒక్కటైన నూతన జంటలు తమ బృందాలతో స్వామివారి సన్నిధిలో వ్రతాలు ఆచరించారు. శనివారం ఒక్కరోజు సుమారు 4వేల వ్రతాలు జరగ్గా వివిధ విభాగాల ద్వారా సుమారు రూ.50లక్షలు ఆదాయం సమకూరింది.
‘ప్రసాద్ స్కీం’ పనులకు టెక్నికల్ బిడ్‌లో ఆరుగురు
భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం కేంద్రప్రభుత్వ పఽథకం ప్రసాద్‌స్కీం పనులకు దశాబ్దకాలంగా అవాంతరాలు ఎ దురవుతున్నాయి. గతనెలలో టెండర్లు పి లిచి ఫైనల్‌చేసిన అనంతరం సింహాచలం దేవస్థానంలో చందనోత్సవ ఏర్పాట్లలో నిర్మాణంకూలి పలువురు మృతి చెందిన ఘటనలో అన్నవరం పనులు దక్కించుకున్న గుత్తేదారు సంస్థ అక్కడ గోడనిర్మించిన సంస్థ ఒక్కటే కావడంతో ప్రభుత్వం ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. దీంతో టూరిజం అధికారులు షార్టుటెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. శనివారం తెరిచిన టెక్నికల్ బిడ్‌లో ఆరుగురు గుత్తేదారులు టెండర్లలో పాల్గొన్నారని, ఫైనాన్స్ బిడ్‌ను తెరిచి టెండర్ల ఖరారు ప్రక్రియ పూర్తి చేస్తామని టూరిజంశాఖ అధికారులు తెలిపారు. పైనాన్స్‌బిడ్‌లు సోమవారం ఓపెన్ చేయనున్నట్టు వారు స్పష్టం చేశారు.