Share News

కార్తీకం.. రూ.కోటి ఆదాయం!

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:31 PM

అన్నవరం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం చివరిదశకు చేరుతుండడంతో అన్న వరం సత్యదేవుడి సన్నిధి ఆదివారం అశేష భక్తజనంతో పోటెత్తింది. సత్యదేవుడి వ్రతాల సంఖ్య 10వేలు దాటింది. సుమారు లక్షమంది భక్తులు స్వామిని దర్శించుకోగా వివిధ విభాగాల

కార్తీకం.. రూ.కోటి ఆదాయం!
సత్యదేవుడి ఆలయంలో వ్రతాలు ఆచరిస్తున్న భక్తులు

సత్యదేవుడి సన్నిధికి ఆదివారం లక్షమంది భక్తుల రాక

10523 వ్రతాలు

వివిధ విభాగాల ఆలయానికి సమకూరిన రూ.కోటి ఆదాయం

అన్నవరం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం చివరిదశకు చేరుతుండడంతో అన్న వరం సత్యదేవుడి సన్నిధి ఆదివారం అశేష భక్తజనంతో పోటెత్తింది. సత్యదేవుడి వ్రతాల సంఖ్య 10వేలు దాటింది. సుమారు లక్షమంది భక్తులు స్వామిని దర్శించుకోగా వివిధ విభాగాల ద్వారా రూ.కోటి ఆదా యం లభించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని 2గంటల నుంచి వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభి ంచారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చైర్మన్‌ రోహిత్‌ లిఫ్ట్‌ ప్రాంగణం, ఈవో సుబ్బారావు వ్రత మండపాలు, క్యూలైన్‌లను పర్యవేక్షించారు. రద్దీ అధికంగా ఉండడంతో ఆలయం లోపల ఖాళీ ఆధారంగా హోల్డింగ్‌ పాయింట్ల నుంచి రథపాత్‌కు వదిలారు. తూర్పురాజగోపురం ఎదురుగా రావిచెట్టు దిగువున ఉన్న గేట్ల ను మూసివేశారు. స్వామివారి ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, వ్రతంకోసం వచ్చిన భక్తులు వ్ర తం, దర్శనం పూర్తవడానికి సుమారు 5గంటలు వేచిఉన్నారు. సత్యదేవ నిత్యాన్నదాన ట్రస్ట్‌ ద్వారా 40వేల మంది భక్తులకు ఉచిత పులిహోర ప్రసాదం వితరణ గావించారు.

Updated Date - Nov 16 , 2025 | 11:31 PM