రూ.2.50 కోట్లతో విశ్రాంత షెడ్డు సత్యదేవుడి భక్తులకు అంకితం
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:19 AM
అన్నవరం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రము ఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో ప్రముఖ ఫార్మా షూటికల్ సంస్థ లారస్ ల్యాబ్ రూ.2.50 కోట్లతో నిర్మించిన విశ్రాం త షెడ్డును శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించగా దీనిని భక్తులకు అంకితమిస్తున్నట్టు సంస్థ సీఈవో చావా సత్యనారాయణ పేర్కొన్నారు. భక్తులు అధికంగా ఉండే పశ్చిమ రాజగోపురం ఎదురుగా దీనిని నిర్మించారు. రత్న
నిర్మించిన లారస్‌ల్యాబ్ సంస్థ
అన్నవరం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రము ఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో ప్రముఖ ఫార్మా షూటికల్ సంస్థ లారస్ ల్యాబ్ రూ.2.50 కోట్లతో నిర్మించిన విశ్రాం త షెడ్డును శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించగా దీనిని భక్తులకు అంకితమిస్తున్నట్టు సంస్థ సీఈవో చావా సత్యనారాయణ పేర్కొన్నారు. భక్తులు అధికంగా ఉండే పశ్చిమ రాజగోపురం ఎదురుగా దీనిని నిర్మించారు. రత్నగిరికి విచ్చేసే సాధారణ భక్తులు ఎండకు ఎండి, వర్షానికి తడుస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. 2023లో దీనిని నిర్మించేందుకు సంస్థ ముందుకొచ్చినా సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఇటీవల అన్నవరం దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో వీర్ల సుబ్బారావు మరోసారి సంస్థ ప్రతినిధులతో చర్చించి కార్తీకమాసం ప్రారంభానికి అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నించారు. ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ లారస్ సంస్థ దాతృత్వాన్ని కొనియాడారు. రాష్ట్రం నలుమాలల నుంచి విచ్చేసే భక్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుం దన్నారు. ఆలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి పరిచేందుకు కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్ రోహిత్, సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్‌రాజా పాల్గొన్నారు.