అన్నవరం దేవస్థానం ఈవోగా త్రినాథరావు బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:15 AM
అన్నవరం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం నూతన ఈవోగా నియమితులైన వేండ్ర త్రినాథరావు బు ధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా స్వామిని దర్శించుకున్న ఆయన అనివేటి మండపంలో ఇప్పటివరకు ఈవోగా ఉన్న వీర్ల సుబ్బారావు నుం
భక్తులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని ఆలయ సిబ్బందికి సూచన
అన్నవరం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం నూతన ఈవోగా నియమితులైన వేండ్ర త్రినాథరావు బు ధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా స్వామిని దర్శించుకున్న ఆయన అనివేటి మండపంలో ఇప్పటివరకు ఈవోగా ఉన్న వీర్ల సుబ్బారావు నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు సుబ్బారావుకు వీడ్కోలు పలికి త్రినాథరావుకు స్వాగతం పలికారు. అనంతరం ఈవో కార్యాలయంలో త్రినాథరావు సిబ్బందితో సమావేశమయ్యారు. గతంలో మూడు పర్యాయాలు అన్నవరం దేవస్థానం ఈవోగా పనిచేసిన అనుభవంతో సిబ్బందితో ఎటువంటి పరిచయ కార్యక్రమం లేకుండానే పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐవీఆర్‌ఎస్ సర్వేలో భక్తుల అసంతృప్తి శాతం అధికంగా ఉండడంతో అన్నవరం దేవస్థానం ఆరోస్థానానికి పరిమితమయిన సంగతి తెలిసిందే. అయితే భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ వారి సందేహాలను విసుగుచెందకుండా నివృత్తి చేయాలని, సిబ్బంది సమష్టిగా పని చేస్తే మొదటిర్యాంక్ రావడం పెద్ద కష్టమేమి కాదని సూచించారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంటా విష్ణు, ఈఈ రామకృష్ణ, పీఆర్వో అనకాపల్లి ప్రసాద్, ఏఈవోలు సూపరెంటెండెంట్‌లు పాల్గొన్నారు.