సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లకు అరుంధతి నక్షత్ర దర్శనం
ABN , Publish Date - May 10 , 2025 | 12:10 AM
అన్నవరం, మే 9 (ఆంధ్రజ్యోతి): సత్యదేవుడి వార్షిక దివ్య కల్యాణోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం నవ దంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్ల అరుంధతి నక్షత్ర దర్శ నాన్ని పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు స్వామి,అమ్మవార్లను ప్రధానాలయం నుంచి తూర్పు రాజగోపు

కోలాహలంగా గ్రామోత్సవం
ఆకట్టుకున్న దేవతామూర్తుల వేషధారణలు
అన్నవరం, మే 9 (ఆంధ్రజ్యోతి): సత్యదేవుడి వార్షిక దివ్య కల్యాణోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం నవ దంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్ల అరుంధతి నక్షత్ర దర్శ నాన్ని పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు స్వామి,అమ్మవార్లను ప్రధానాలయం నుంచి తూర్పు రాజగోపురం వద్దకు మేళతాళాలతో తోడ్కొని వచ్చా రు. ప్రత్యేక పూజల అనంతరం దాంపత్యజీవితానికి ప్రతీకలైన వశిష్ట, అరుంధతి నక్షత్రాలను చూపించి వారికి అర్ఘ్యం అర్పించారు. సాయంత్రం ఐదు గంటలకు దర్బారు మండపంలో ప్రధానార్చ కుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పండితులు ప్రధాన ప్ర వేశ స్థాలీపాక హోమాలు నిర్వహించారు. వివాహం అనం తరం అమ్మవారు మెట్టినింటికి చేరుకుని అక్క డి నుంచి మరో జీవన ప్రయాణానికి నాంది పలికేందుకు ప్రతీకగా ఈ వేడుక జరిపారు. చతుర్వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. గ్రామో త్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు స్వామి,అమ్మవార్లను రావణబ్రహ్మ వాహనంపై ఆశీనులు గావించి విహరింపజేశారు. పలు సాంస్కృ తిక ప్రదర్శనల నడుమ గ్రామోత్సవం కోలాహలంగా సాగింది. స్వామివారి వాహనసేవల్లో రావణ వాహనసేవకు అధిక ప్రాధాన్యం ఉండడంతో అన్నవరం, పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి తిలకించారు. తప్పెటగుళ్లు, కోలాటం, వివిధ దేవతామూర్తుల వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి.