Share News

సత్యదేవుడి కార్తీకమాస ఆదాయం రూ.21.75 కోట్లు

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:10 AM

అన్నవరం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధికి ఈ ఏడాది కార్తీకమాసంలో అన్ని విభాగాల ద్వారా రూ.21,75,95,167 ఆదాయం సమకూరినట్టు ఆల య ఈవో వీర్ల సుబ్బారావు తెలిపారు. సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పా టుచేసి వివరాల

సత్యదేవుడి కార్తీకమాస ఆదాయం రూ.21.75 కోట్లు
భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను లెక్కిస్తున్న సిబ్బంది

తగ్గిన వ్రతాల సంఖ్య

పెరిగిన ఆదాయం

వెల్లడించిన ఈవో సుబ్బారావు

అన్నవరం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధికి ఈ ఏడాది కార్తీకమాసంలో అన్ని విభాగాల ద్వారా రూ.21,75,95,167 ఆదాయం సమకూరినట్టు ఆల య ఈవో వీర్ల సుబ్బారావు తెలిపారు. సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పా టుచేసి వివరాలను వెల్లడించారు. సత్యదేవుడి సన్నిధికి కార్తీకమాసంలో విచ్చేసిన భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను రెండోవిడత సోమవారం లెక్కించారు. రూ.1.77,73,072 నగదు, 43 గ్రాముల బంగారం, 978 గ్రాముల వెండి సమకూరాయి. అయితే వీటితో కలిపి కా ర్తీకమాసంలో మొత్తంగా రూ.21,75,95,167 ఆదా యం సమకూరిందని వెల్లడించారు. గతేడాది కార్తీకమాసంతో పోలిస్తే ఈ ఏడాది కార్తీకంలో వ్రతాల సంఖ్య 12,666 తగ్గగా అన్ని విభాగాల ఆదాయం నుంచి గతేడాది కంటే రూ.62,13,099 పెరిగిందన్నారు. వీటిలో ప్రధానంగా వ్రతం టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.7.81 కోట్లు, ప్ర సాదం విక్రయాల ద్వారా రూ. 4.57 కోట్లు, హుండీలలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3.51 కోట్లు, సత్రంగదుల అద్దెల ద్వారా రూ.1.23 కోట్లు ఆదాయం లభించింది. మొత్తం 15 విభాగాల నుంచి ఈ ఆదాయం సమకూరింది. మిగిలిన విభా గాల ఆదాయాలను పరిశీలిస్తే కల్యాణమండపాల ద్వారా రూ.6.18 లక్షలు, స్వామివారి నిత్యకల్యాణాల నుంచి రూ.7.52 లక్షలు, ఆర్జితసేవల ద్వారా రూ. 9.63 లక్షలు, ఏసీ వ్రతాల నిర్వహణ ద్వా రా రూ.61.56 లక్షలు, రవాణా విభాగం రూ. 38.39 లక్షలు, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.89. 60 లక్షలు సమకూరాయని వెల్లడించారు.

తుఫాను వల్ల తగ్గిన వ్రతాలు

వ్రతాలసంఖ్య తగ్గడానికి మొంథా తుఫాను కారణమన్నారు. ఈ ఏడాది కార్తీకంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా సిబ్బంది సమష్టిగా కష్టపడి పనిచేశారన్నారు. చైర్మన్‌ రోహిత్‌ నిరంతరం పర్యవేక్షణతో సత్ఫలితాలు సాధించామన్నారు. దేవదాయశాఖ ప్రత్యేక అధికారిగా రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ వేండ్ర త్రినాధరావు, డిప్యూటీ కమిషనర్లు రమేష్‌బాబు, సూర్యచక్రధరరావు, విశ్వనాధరాజును నియమించి వారి సలహాలు, సూచనలు పర్యవేక్షణలతో అంతా సవ్యంగా జరిగిందన్నారు. ఇదిలా ఉండగా గతేడాది కంటే కార్తీకమాసం ఆదాయం పెరగడానికి లీజుల నుంచి గతంలో రూ.1.09 కోట్లు వసూలుకాగా ఈ ఏడాది కార్తీకంలో రూ.2.27 కోట్లు వసూలు కావడం, గతేడాది ఆదాయంలో హుండీల కానుకలు 32 రోజులుకు చూపించగా ఈఏడాది కార్తీక ఆదాయంలో హుండీ ఆదాయం 49రోజుల ఆదాయం చూపడంతో ఆదాయం పెరిగినట్టు ఈవో వెల్లడించారు. కార్తీకంలో ఇంజనీరింగ్‌ సివిల్‌ పనులకు రూ. 81.88 లక్షలు, విద్యుత్‌ విభాగం నుంచి రూ.20లక్షలు వ్యయం చేశారన్నారు. సమావేశంలో డిప్యూ టీ కమిషనర్‌ బాబూరావు, పీఆర్వో అనకాపల్లి ప్ర సాద్‌, ఏఈవోలు, ఇంజనీరింగ్‌ అధికారులు ఉన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 12:10 AM