సత్యదేవుడికి రూ.8.40 కోట్ల ఆదాయం
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:11 AM
అన్నవరం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో కార్తీకమాస వ్రతాల సంఖ్య లెక్క తేలింది. గురువారంతో కార్తీకమాసం ముగియడంతో వివరాలను అధికారులు వెల్లడించారు. వ్రతాల ద్వారా రూ.8.40 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది వ్రతాల సంఖ్య తగ్గిన విషయం విధితమే. గతేడాది కార్తీకమాసంలో 1,45,732 వ్రతాలు జరగగా ఈఏడాది 11256 లోటుతో 1,34,476తో ముగిసింది. అన్న
కార్తీకమాసంలో వ్రతాల సంఖ్య 1,34,476
స్వామివారిని దర్శించిన 13 లక్షల మంది భక్తులు
వెల్లడించిన అధికారులు
అన్నవరం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో కార్తీకమాస వ్రతాల సంఖ్య లెక్క తేలింది. గురువారంతో కార్తీకమాసం ముగియడంతో వివరాలను అధికారులు వెల్లడించారు. వ్రతాల ద్వారా రూ.8.40 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది వ్రతాల సంఖ్య తగ్గిన విషయం విధితమే. గతేడాది కార్తీకమాసంలో 1,45,732 వ్రతాలు జరగగా ఈఏడాది 11256 లోటుతో 1,34,476తో ముగిసింది. అన్నవరం దేవస్థానంలో రూ.300, 1000, 1500, 2000 ధరల్లో వ్రతం టిక్కెట్లు అందుబాటులో ఉండగా వీటిలో ఆన్‌లైన్ టిక్కట్లతో కలిపి సామాన్యులు ఆచరించుకున్న రూ.300 ధర వ్రతాలు 96484 జరిగా యి. రూ.100 ధర వ్రతాలు 16099, రూ.1500 ధర వ్రతాలు 9511, రూ.2000 ధర వ్రతాలు 123 82 జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది కార్తీక మాసంంలో కేవలం వ్రతాల ద్వారా స్వా మివారి ఖజానాకు రూ.8,40,74,700 ఆదాయం లభించింది. మిగిలిన విభాగాల నుంచి మరో రూ.11.50 కోట్లు కలిపితే కార్తీకమాస ఆదాయం సుమారు రూ.20 కోట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. రెండోపర్యాయం హుండీల లెక్కింపు పూర్తయిన తరువాత అధికారికంగా కార్తీకమాస ఆదాయం వెల్లడిస్తామని ఈవో వీర్ల సుబ్బారావు తెలిపారు. గతేడాది కంటే వ్రతాల సంఖ్యతో పాటుగా ఆదాయం కూడా సుమారు రూ.50 లక్షలనుంచి రూ.కోటి వరకు తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు. కార్తీకమాసం అంతా కలిపి సు మారు 13 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో దేవస్థానం సిబ్బంది సమష్టి కృషితో భక్తులకు ఎక్కడా అసౌకర్యం, ఎటువంటి అవాం ఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసు కున్నారు. అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ పర్వదినాల్లో పశ్చిమరాజగోపురం వద్దనే ఉండి దళారుల ప్రవేశాన్ని నిరోధించి కేవలం వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే లిఫ్ట్‌సౌకర్యం పూర్తిస్థాయిలో అందించగలగడంతో పలువురి ప్రశంసలు పొందారు. కార్తీక పౌర్ణమి, స్వామివారి తెప్పోత్సవం, గిరిప్రదక్షిణ, జ్వాలాతోరణం, పంపా హారతులు వంటి ముఖ్యమైన కార్యక్రమాలను నిర్దేశించిన సమయానికి నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. పోలీసులు కూడా ఎంతో కష్టించి భక్తులకు సేవలందించారు.