Share News

అంచనాలకు ఆమోదం..

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:35 AM

అన్నవరం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో ఈ ఏడాది కార్తీకమాసంలో భక్తుల రద్దీ దృష్ట్యా చేపట్టాల్సిన సౌకర్యాలు, ఇతర అవసరాల ప్రధాన అజెండాలుగా శుక్రవారం నిర్వహించిన పాలకమండలి సమావేశంలో చైర్మన్‌ రోహిత్‌ ఆమోదం తెలిపారు. ప్రధానంగా రూ.5.13 కోట్లతో హరిహరమార్గ్‌ పార్కింగ్‌, వన్‌వేగా హరిహరసదన్‌ వెనకనుంచి సత్యగిరి జంక్షన్‌కు వన్‌వేగా ఆదిశంకర్‌ మార్గ్‌ మీదుగా కొండదిగువకు వెళ్లేందుకు అవసరమైన గ్రా

అంచనాలకు ఆమోదం..
అన్నవరంలో కార్తీకమాస ఏర్పాట్ల సమీక్షలో పాల్గొన్న ఈవో, చైర్మన్‌

అన్నవరం దేవస్థానంలో కార్తీకమాస పనులపై పాలకమండలి సమావేశం

రూ.5.13 కోట్లతో గ్రావెల్‌రోడ్డు, వన్‌వే, పార్కింగ్‌ సౌకర్యాలకు అంచనాలు

రూ.5.25 లక్షలతో తాత్కాలిక మరుగుదొడ్లు

రూ.10 లక్షలతో వాటర్‌ప్రూఫ్‌ షామియానాలు ఏర్పాటు

గిరి ప్రదక్షిణకు రూ.7.70 లక్షలతో పనులు

తెప్పోత్సవానికి రూ.5.50 లక్షలతో వివిధ పనులకు చైర్మన్‌ గ్రీన్‌సిగ్నల్‌

అన్నవరం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో ఈ ఏడాది కార్తీకమాసంలో భక్తుల రద్దీ దృష్ట్యా చేపట్టాల్సిన సౌకర్యాలు, ఇతర అవసరాల ప్రధాన అజెండాలుగా శుక్రవారం నిర్వహించిన పాలకమండలి సమావేశంలో చైర్మన్‌ రోహిత్‌ ఆమోదం తెలిపారు. ప్రధానంగా రూ.5.13 కోట్లతో హరిహరమార్గ్‌ పార్కింగ్‌, వన్‌వేగా హరిహరసదన్‌ వెనకనుంచి సత్యగిరి జంక్షన్‌కు వన్‌వేగా ఆదిశంకర్‌ మార్గ్‌ మీదుగా కొండదిగువకు వెళ్లేందుకు అవసరమైన గ్రావెల్‌ రోడ్డు వేయడానికి తయారుచేసి న అంచనాలకు చైర్మన్‌ ఆమోదం తెలిపారు. కా ర్తీకపౌర్ణమి రోజున లక్షలాది భక్తులు గిరిప్రదక్షిణకు విచ్చేయనున్న నేపథ్యంలో స్టాల్స్‌ ఏర్పాటు, పలుచోట్ల టెంట్‌లు, షామియానాలు, టాయిలెట్ల ఏర్పాటుకు రూ.7.70 లక్షల అంచనా పనులకు ఆ మోదం లభించింది. క్షీరాబ్ది ద్వాదశిరోజున స్వామివారి తెప్పోత్సవం జరగనున్న నేపథ్యంలో రూ 5.50 లక్షలతో వివి పనులు చేపట్టేందుకు, రూ.5 లక్షలతో పడమర రాజగోపురం వద్ద షెడ్లు, గ్రీన్‌మ్యాట్‌, హోల్డింగ్‌ పాయింట్ల ఏర్పాటుకు, రూ.10 లక్షలతో రూ.2వేలు, రూ.1500 వ్రతమండపాల వద్ద వెయిటింగ్‌ హాల్స్‌, వాటర్‌ ప్రూఫ్‌ షామియానాల ఏర్పాటుకు తయారుచేసిన అంచనాలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. రూ.28 లక్షలతో కొండదిగువ పవర్‌ హౌస్‌ నుంచి కొండపైకి విద్యుత్‌ సరఫరా కోసం అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌ ద్వారా రెండోలైన్‌ ఏర్పాటుకు, రూ.11.50 లక్షలతో అన్నవరం దత్తత దేవాలయమైన బలిఘట్టం సత్యదేవుడి ఆలయంలో వివిధ అభివృద్ధి పనులకు, రూ.5.25 లక్షలతో వివిధ ప్రాంతాల్లో 22 తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుకు, రూ.4.50 లక్షలతో పాత, కొ త్త సెంటినరీ కాటేజీల వద్ద స్విచ్‌బోర్డుల ఏర్పా టు తదితర పనులను ఆమోదించారు. ఇటీవల పలు వ్యాపార లైసెన్స్‌ హక్కుల కోసం నిర్వహించిన బహిరంగవేలంలో హెచ్చుపాటలను, దేవస్థానానికి అవసరమైన పనులకు లోయెస్ట్‌ టెం డర్లు ఆమోదించారు. సమావేశంలో ఈవో సు బ్బారావు, అన్ని విభాగాల ఏఈవోలు, సూపరెంటెండెంట్ల్‌, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

కార్తీకమాస ఏర్పాట్లపై సమీక్ష

అన్నవరం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాసంలో సత్యదేవుడి సన్నిధికి అసంఖ్యాకంగా విచ్చేసే భక్తులకు చేపట్టాల్సిన సౌకర్యాలపై ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్‌ రోహిత్‌ అ ధ్యక్షతన శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఈ ఏడాది కార్తీకమాసంలో 13 రోజులు పర్వదినాలుగా, మి గిలిన రోజులు సాదారణ రోజులుగా గుర్తించా రు. పర్వదినాల్లో రోజుకు లక్షపైబడి, సాధారణ రోజుల్లో సుమారు 50వేలమంది భక్తులు విచ్చేస్తారని అంచనా వేశారు. భక్తులకు ట్రాఫిక్‌ ఇ బ్బందులు కలగకుండా వ్రతం, దర్శనం త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈవో సూచించారు. పర్వదినాల్లో ఒంటిగంట నుంచి వ్రతాలు, 2గంటల నుంచి సర్వదర్శనాలు ప్రార ంభించాలని నిర్ణయించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా, గతేడాది తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాలని చైర్మన్‌ రోహి త్‌ సూచించారు. సెక్యూరిటీ నిత్యం అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ఇంజనీరింగ్‌ అధికారులు దృష్టి సారించాలన్నారు. సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

Updated Date - Sep 06 , 2025 | 12:35 AM