Share News

ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో ‘అన్నవరం’ ఆరో స్థానం

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:00 AM

అన్నవరం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రధానాలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానా నికి భక్తుల నుంచి అసంతృప్తి శాతం కొనసాగుతుంది. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన సర్వేలో అన్నవరం దేవస్థానం 69

ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో ‘అన్నవరం’ ఆరో స్థానం

కొనసాగుతున్న భక్తుల అసంతృప్తి

అన్నవరం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రధానాలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానా నికి భక్తుల నుంచి అసంతృప్తి శాతం కొనసాగుతుంది. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన సర్వేలో అన్నవరం దేవస్థానం 69.7 శాతంతో ఆరోస్థానంలో నిలిచింది. 73.8 శాతంలో ద్వారకా తిరుమల మొదటిస్థానంలో ఉండగా 67.9 శాతంతో విజయవాడ చివరిస్థానంలో నిలిచింది. అన్నవరం ప్రసాదం నాణ్యత, రుచి విషయంలో 77.6 శాతం బాగుందని తెలిపారు. ఈ విషయంలో అన్నవరం దేవస్థానం 5వ స్థానం, శానిటేషన్‌ నిర్వహణలో 64.2 శాతం మంది బాగుందని చెప్పడంతో ఆరోస్థానంలో ఉంది. ఏడు ప్రధాన దేవాలయాల్లో అక్టోబరు 25 నుంచి నవంబరు 25 వరకు చేపట్టిన సర్వేలో ఈ గణాంకాలను విడుదల చేశారు. దర్శనం సంతృప్తిగా జరగడం, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పన, ప్రసాదం రుచి, నాణ్యత, పారిశుధ్యంపై ప్రతినెలా ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహిస్తుంది.

Updated Date - Dec 02 , 2025 | 12:00 AM