సత్యదేవుడి ఆదాయం రూ.1.69 కోట్లు
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:40 AM
అన్నవరం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధిలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించగా రూ.1,69,06,902 నగదు, 39 గ్రాముల బంగారం, 765 గ్రాముల వెండి సమకూరాయి. వీటితోపాటు యూఎస్ ఏకు చెందిన 170 డాలర్లు, యు ఏఈ
అన్నవరం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధిలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించగా రూ.1,69,06,902 నగదు, 39 గ్రాముల బంగారం, 765 గ్రాముల వెండి సమకూరాయి. వీటితోపాటు యూఎస్ ఏకు చెందిన 170 డాలర్లు, యు ఏఈ 455 దిరహమ్స్, సింగపూర్ 5 డాలర్లు, ఇంగ్లాండ్ 25 పౌండ్స్, పలుదేశాల కరెన్సీని భక్తులు హుండీల్లో వేశారు. లెక్కింపును ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్ రోహిత్ పర్యవేక్షించగా సిబ్బంది, సేవాసంస్థల సభ్యులు పాల్గొన్నారు. 32రోజులకు ఈ ఆదాయం సమకూరగా రోజుకు సరాసరిన రూ. 5.28 లక్షలు భక్తులు కానుకల రూపంలో సమర్పించారు.