సత్యదేవుడి హుండీల ఆదాయం రూ.1.57 కోట్లు
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:39 AM
అన్నవరం, జూలై 30 (ఆంధ్ర జ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధిలోని హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించగా రూ.1,57, 09,001 నగదు, 35 గ్రాముల బం గారం, 659 గ్రాముల వెండి సమకూరాయి. వీటితో పాటుగా యూ ఎస్‌ఏకు చెందిన 125 డాలర్లు, ఇంగ్లాం
అన్నవరం, జూలై 30 (ఆంధ్ర జ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధిలోని హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించగా రూ.1,57, 09,001 నగదు, 35 గ్రాముల బం గారం, 659 గ్రాముల వెండి సమకూరాయి. వీటితో పాటుగా యూ ఎస్‌ఏకు చెందిన 125 డాలర్లు, ఇంగ్లాండ్ 20 పౌండ్స్, సింగపూర్ 30 డాలర్లు, యుఏఈ 90 దిరహమ్స్, రష్యన్ 50 రూబీలు లభించాయి. లెక్కి ంపును ఈవో సుబ్బారావు, చైర్మన్ రోహిత్ పర్యవేక్షించగా సిబ్బంది, స్వచ్చంధ సేవకులు పాల్గొన్నారు. 35 రోజులకు ఈ ఆదాయం లభించగా సరాసరిన రోజుకు రూ.4.48 లక్షల ఆదాయం హుండీలలో భక్తులు సమర్పించుకున్నారు.