ఐవీఆర్‌ఎస్ సర్వేలో రెండవస్థానానికి ‘అన్నవరం’
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:02 AM
అన్నవరం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం ప్రముఖ ఆలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై చేపట్టిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవస్థానం గత నెల కంటే ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని రెండో స్థానానికి ఎగబాకింది. గత నెలలో చివరిస్థానం లో ఉన్న అన్నవరం దేవస్థానంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేయడం, దేవస్థానం ఈవో సుబ్బారావు ర్యాంకింగ్ మెరుగుపరచ

పారదర్శకంగా సీఆర్వోలో
గదుల కేటాయింపు, దర్శన
సమయంతో ర్యాంక్ మెరుగు
అన్నవరం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం ప్రముఖ ఆలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై చేపట్టిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవస్థానం గత నెల కంటే ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని రెండో స్థానానికి ఎగబాకింది. గత నెలలో చివరిస్థానం లో ఉన్న అన్నవరం దేవస్థానంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేయడం, దేవస్థానం ఈవో సుబ్బారావు ర్యాంకింగ్ మెరుగుపరచడం కోసం సిబ్బందికి సూచనలు చేయడం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ర్యాం కింగ్ మెరుగుపడేందుకు దోహదం చేశా యి. దీంతో పాటుగా సీఆర్వో కార్యాలయం లో భక్తులకు గదుల కేటాయింపు పారదర్శకంగా ఉండడంతో భక్తులు సంతృప్తి వ్య క్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ మెసేజీలలో ముఖ్యమైనవి రాత్రి 9గంటల వరకు వేచిచూసి ఎవ్వరూ రాకుంటే వాటిని సైతం సాధారణ భక్తులకు కేటాయిస్తున్నారు. స్వామివారి దర్శనం, అన్నదానం క్యూలైన్‌లలో భక్తులు ఎక్కడా నిరీక్షణ లేకుండా త్వరితగతిన పూర్తిచేసుకుంటున్నారు. తరువాత నెల సర్వేలో మొదటిస్థానం సాధించేందుకు కృషి చేస్తానని ఈవో సుబ్బారావు ఆంధ్రజ్యోతికి తెలిపారు. రెండవ నెల సర్వేలో సింహాచలం దేవస్థానం మొదటిస్థానం సాధించింది.