Share News

నేడే వేడుక..

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:39 AM

అన్నవరం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): సత్య దేవుడి కోసం రత్న,సత్యగిరి కొండలు ఎదురుచూస్తున్నాయి. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే స్వామివెంట నడిచే భక్తుల గోవిందనామస్మరణలతో పులకరించపోనున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాలకు కార్తీక పౌర్ణమి పర్వదినం ముఖ్య వేదిక కానుంది. ఏటా కార్తీకపౌర్ణమి నాడు కాకినాడ జిల్లా అన్నవరంలో గిరిప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది. బుధవారం కార్తీకపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని గిరిప్రదక్షిణ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 8గంటలకు తొలిపావంచా వద్ద

నేడే వేడుక..
గతేడాది గిరిప్రదక్షిణకు విచ్చేసిన అశేష భక్తజనం (ఫైల్‌ఫొటో)

సత్యదేవుడి రాక కోసం ఎదురుచూస్తున్నరత్న, సత్యగిరులు

స్వామివెంట గిరిప్రదక్షిణలో పాల్గొననున్న రెండు లక్షల మంది భక్తులు

సుమారు 8.5 కిలోమీటర్ల గిరియాత్ర

ఉదయం 8 గంటలకు పల్లకీసేవ, మధ్యాహ్నం 2 గంటలకు సత్యరథంతో గిరిప్రదక్షిణ

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తం చేసిన ప్రభుత్వం

అన్నవరం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): సత్య దేవుడి కోసం రత్న,సత్యగిరి కొండలు ఎదురుచూస్తున్నాయి. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే స్వామివెంట నడిచే భక్తుల గోవిందనామస్మరణలతో పులకరించపోనున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాలకు కార్తీక పౌర్ణమి పర్వదినం ముఖ్య వేదిక కానుంది. ఏటా కార్తీకపౌర్ణమి నాడు కాకినాడ జిల్లా అన్నవరంలో గిరిప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది. బుధవారం కార్తీకపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని గిరిప్రదక్షిణ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 8గంటలకు తొలిపావంచా వద్ద నుంచి స్వామివారి పల్లకీలో బాజాభజంత్రీలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ జాతీయరహదారి మీదుగా బెండపూడి పుష్కరకాలువ మీదుగా జరిగే గిరిప్రదక్షిణ యాత్ర సుమారు 8.5 కిలోమీటర్ల మేర సాగనుంది. ఇటీవల కాశీబుగ్గ ప్రమాద ఘటన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ యంత్రాంగాన్ని దేవదాయశాఖ అధికారులను ఆదేశించింది. దీనిలో భాగంగా ఇప్పటికే కాకినాడ జల్లా ఎస్పీ గిరిప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించారు. దేవదాయ శాఖ ప్రత్యేక అధికారిగా నియమించిన త్రినధరావు అన్నవరం దేవస్థానం ఈవో, చైర్మన్‌ ఇతర అధికారులతో గిరిప్రదక్షిణ రోడ్డు, అక్కడ భక్తులకు కల్పించేందుకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. సుమారు 2లక్షల మం ది భక్తులు విచ్చేస్తారని అంచనాతో దానికణుగుణంగా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు.

12 చోట్ల పళ్లు, మజ్జిగ పంపిణీకి స్టాల్స్‌

12చోట్ల భక్తులకు పులిహోర, మజ్జిగ, పళ్ల స్టాల్స్‌ను దాతల సహకారంతో పంపిణీ చేయనున్న ట్టు అధికారులు వివరించారు. పల్లకీ, సత్యరథం వెంబడి రోప్‌పార్టీతో బందోబస్తు చేపట్టనున్నారు. రథం జాతీయ రహదారిపైకి చేరే సమయంలో అరగంట ముందు భారీవాహనాలను నిలుపులద ల చేసి చిన్నవాహనాలకు వన్‌వే ద్వారా మల్లించాలని నిర్ణయించారు. ఎక్కడికక్కడ సైన బోర్డు లు ఏర్పాటుచేయాలని, పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌ ద్వారా భక్తులకు మార్గదర్శక సమాచారం ఇవ్వా లని కాకినాడ ఎస్పీ అధికారులకు సూచించారు.

భారీ బందోబస్తు

ఇన్‌చార్జి ఆర్డీవో మల్లిబాబు మాట్లాడు తూ గిరిప్రదక్షిణకు దేవస్థానం సిబ్బంది కాకుండా 724మంది పోలీసులు, 8 మం ది సీఐలు, 16మంది ఎస్‌ఐలు, ఆరుగురు ఎమ్మార్వోలు, 20మంది వీఆర్వోలు భక్తులకు సేవలందిస్తారని తెలిపారు. గిరిప్రదక్షిణకు ప్రత్యేకాధికారిగా నియమించిన త్రినాధరావు దేవస్థానం సిబ్బందితో సమావేశమయ్యారు. ఉదయం, మధ్యా హ్నం గిరిప్రదక్షిణతో పాటుగా సత్యదేవుడి దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం ఏర్పాట్లపై చర్చించారు. 1500 వ్రతాల నిర్వహణకు ప్రధానాలయం పక్కనే ఉన్న ప్రాకారం వద్ద అదనపు మండపాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సాయంత్రం పంపా హారతులు, జ్వాలాతోరణం, కార్యక్రమాలన్నీ నిర్దేశించిన సమయానికి జరపాలని వైదిక కమిటీకి సూచించారు.

Updated Date - Nov 05 , 2025 | 12:39 AM