అన్నవరం...అప్రమత్తం!
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:31 AM
అన్నవరం నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): కార్తీకపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని ఈనెల 5న సత్యదేవుడి గిరిప్రదక్షిణ నిర్వహణ, జాగ్రత్తలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటీవల కాశీబుగ్గ ప్రమాద ఘటన నేపథ్యంలో అప్రమత్తతపై అన్న వరం దేవస్థానం అధికారులకు దేవదాయ శాఖ కమిషనర్ సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలిచ్చారు. అలాగే డిప్యూ టీ సీఎం పవన్‌కల్యాణ్
కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో సత్యదేవుడి గిరిప్రదక్షిణపై ప్రభుత్వం దృష్టి
రెండు లక్షలమంది వస్తారని అంచనా
అన్నవరం దేవస్థానం అధికారులతో దేవదాయ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్
గిరిప్రదక్షిణ జరిగే ప్రాంతమంతా పరిశీలించిన కాకినాడ జిల్లా ఎస్పీ
అన్నవరం నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): కార్తీకపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని ఈనెల 5న సత్యదేవుడి గిరిప్రదక్షిణ నిర్వహణ, జాగ్రత్తలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటీవల కాశీబుగ్గ ప్రమాద ఘటన నేపథ్యంలో అప్రమత్తతపై అన్న వరం దేవస్థానం అధికారులకు దేవదాయ శాఖ కమిషనర్ సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలిచ్చారు. అలాగే డిప్యూ టీ సీఎం పవన్‌కల్యాణ్ ఆదేశాలతో కాకినాడ జి ల్లా ఎస్పీ బిందుమాధవ్ గిరిపద్రక్షిణ జరిగే సు మారు 11 కిలోమీటర్ల దూరాన్ని, భక్తులకు కల్పిం చే ఏర్పాట్లను సోమవారం సాయంత్రం పరిశీలించారు. దేవదాయ కమిషనర్ వీడియో కాన్ఫరె న్స్‌లో మాట్లాడుతూ గిరిప్రదక్షిణకు సుమారు 2లక్షల మంది భక్తులు వస్తారని అంచనా ఉ ందని ఉదయం 8గంటలకు పల్లకీసేవ, మధ్యా హ్నం 2గంటలకు సత్యరథంతో గిరియాత్ర జరు గుతుందన్నారు. ఎక్కడా తోపులాటలకు ఆస్కా రం లేకుండా రోప్‌పార్టీ ఉండాలని, 2 సమయాల్లో గిరిప్రదక్షిణ జరుగుతుందని విస్తృత ప్రచారం చేయాలని దేవదాయ కమిషనర్ రామచంద్రమోహన్ సూచించారు. భక్తులు ఎక్కడా వెయిటింగ్ లేకుండా నిరంతరాయంగా నడక కొనసాగేలా చేయాలని, ఒకేచోట భక్తజనం గుమికూడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు
ఇప్పటికే దేవదాయశాఖ ముగ్గురు ప్రత్యేక అఽ దికారులకు బాధ్యతలు అప్పగించగా గిరిపద్రక్షిణ ఫెస్టివల్ అధికారిగా రీజనల్ జాయింట్ కమిషనర్ వి.త్రినాధరావును నియమించారు. గిరి పద్ర క్షిణ అనంతరం కార్తీకమాసం మిగిలిన పర్వ దినాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయలని సూచించారు. అనంతరం వీడియో కాన్ఫెరెన్సలో వెల్లడించిన అంశాలపై ఈవో సుబ్బారావు, చైర్మన్ రోహిత్ సిబ్బందితో సమావేశంలో వెల్లడించి కమిషనర్ ఆదేశాలకణుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రధానంగా రూ.1500, 2000 వ్రతమండపాల వద్ద వెయిటింగ్ అధికంగా ఉంటుందని పరిస్థితులుకు అనుగుణంగా వ్రతం టిక్కెట్ల విక్రయాలు చేపట్టాలని సూచిం చారు. కార్తీక పౌర్ణమి రోజున సు మారు 15వేల వ్రతాలు జరుగు తాయని అంచనా వేస్తూ ఏర్పా ట్లు, సిబ్బంది ఉండాలని తెలిపారు.
పోలీస్‌లు అప్రమత్తంగా ఉండాలి
డిప్యూటీ సీఎం ఆదేశాలతో కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ సోమవారం సాయంత్రం గిరిపద్రక్షిణ జరిగే సుమారు 11 కిలోమీటర్ల దారిని పరి శీలించారు. స్టాల్స్ ఏర్పాటు, మహిళలకు తాత్కాలిక మరు గుదొడ్ల తదితర వివరాలను దేవస్థానం అధికారులు వివరించగా ఆయన పలు సూచనలు చేశారు. పోలీస్ యంత్రాంగం అంతా చాలా అప్రమత్తంగా బాధ్యతతో వ్యవహరించాలన్నా రు. నిర్లక్ష్యం ప్రదర్శించకుండా పర్యవేక్షణ జరగాలని డీ ఎస్పీ, సీఐలకు సూచించారు. కార్తీకమాసం పూర్తయ్యేవరకు భక్తులు అధికంగా వచ్చే పర్వదినాల్లో భద్రతాచర్యలు, గస్తీ ముమ్మరంగా ఉండాలని సూచించారు.