Share News

భక్తుల సౌకర్యాల కల్పనకు చర్యలు

ABN , Publish Date - May 05 , 2025 | 11:28 PM

అన్నవరం, మే 5 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుని వార్షిక కల్యాణ ఘడియలు సమీపిస్తున్న వేళ అన్నవరం దేవస్థా నం అధికార యంత్రాంగం భక్తుల సౌకర్యాల కల్పనకు ఇతర శాఖల సహకారంతో చర్యలు చేపడుతున్నట్టు ఆలయ ఈవో వీర్ల సుబ్బారావు పేర్కొన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చే శారు. స్వామివారి దివ్యకల్యాణోత్సవాలు ఈ నెల 7న ప్రారంభమై 13తో ముగుస్తాయన్నా రు. ప్రధానం

భక్తుల సౌకర్యాల కల్పనకు చర్యలు
కల్యాణోత్సవ ఏర్పాట్లను ఈవోతో కలిసి పరిశీలిస్తున్న పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణి

రేపటి నుంచి అన్నవరం సత్యదేవుని దివ్యకల్యాణోత్సవాలు

8న దివ్యకల్యాణం, 11న రథోత్సవం

50వేలమంది విచ్చేస్తారని అంచనా

ఆలయ ఈవో వీర్ల సుబ్బారావు

అన్నవరం, మే 5 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుని వార్షిక కల్యాణ ఘడియలు సమీపిస్తున్న వేళ అన్నవరం దేవస్థా నం అధికార యంత్రాంగం భక్తుల సౌకర్యాల కల్పనకు ఇతర శాఖల సహకారంతో చర్యలు చేపడుతున్నట్టు ఆలయ ఈవో వీర్ల సుబ్బారావు పేర్కొన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చే శారు. స్వామివారి దివ్యకల్యాణోత్సవాలు ఈ నెల 7న ప్రారంభమై 13తో ముగుస్తాయన్నా రు. ప్రధానంగా 8వ తేదీ రాత్రికి జరిగే దివ్యకల్యాణం, 11వతేదీ సాయంత్రం 4గంటలకు నిర్వహించే రథోత్సవం కార్యక్రమాలకు వేలాదిగా భక్తులు తరలివస్తారని దీనికనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. రె వెన్యూ, పోలీస్‌, దేవస్థానం ఇతరశాఖల సమన్వయంతో ఎక్కడా లోటుపాట్లు లేకుండా తగి న ప్రణాళికలతో వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. 8న దివ్యకల్యాణం వీక్షించేందుకు సు మారు 50వేలమంది విచ్చేస్తారని అంచనాతో ఏర్పాట్లు చేశామన్నారు. పటిష్టమైన క్యూలైన్లు, తాగునీటి సౌకర్యం నిరంతరం అందించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. 8న సాయం త్రం 4గంటల నుంచి కొండపైకి భారీ వాహనాలను అనుమతించకుండా కొండదిగువ జూ నియర్‌ కళాశాల మైదానంలో పార్కింగ్‌ సౌక ర్యం కల్పించి అక్కడ నుంచి భక్తులను దేవస్థానం బస్సుల్లో ఉచితంగా కొండపైకి తీసుకెళ్లడం జరుగుతుందని, కల్యాణం అనంతరం 9 ప్రత్యేక కౌంటర్ల ద్వారా ముత్యాల తలంబ్రాల అక్షింతల పంపిణీ చేపడుతున్నామని ఈవో తె లిపారు. ఈ ఏడాది దివ్యకల్యాణోత్సవాలు వారంరోజులు మన సంస్కృతి, సంప్రదాయా లు ప్రతిబింబించే విధంగా పలు సాం స్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అగ్నిప్రమాదాల నియంత్రణకు ఫైర్‌ ఇంజన్లు, వైద్యసదుపాయాల కోసం అంబులెన్లు, కొండపైన వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే దివ్యకల్యాణోత్సవ ఆహ్వానపత్రికలను ప్రముఖులకు అందజేయ డం జరిగిందని ఆయన చెప్పారు. భక్తులు దివ్యకల్యాణం తిలకించి సత్యదేవుడి కృపకు పాత్రులుకావాలని ఈవో సుబ్బారావు కోరారు.

సింహాచలం ఘటన నేపథ్యంలో ప్రత్యేక దృష్టి

అన్నవరంలో ఏర్పాట్ల పరిశీలన

ఇటీవల సింహాచలం దేవస్థానంలో జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకుని కాకినాడ జిల్లా కలెక్టర్‌ అన్నవరంపై ప్రత్యేక దృష్టి సారించా రు. సత్యదేవుని వార్షిక కల్యాణం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దేవస్థానం చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్‌ ఆదేశాలతో సోమవారం సాయంత్రం పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణి కల్యాణోత్సవ ప్రాంగణాన్ని పరిశీలించారు. కల్యాణం వీక్షించేందుకు భక్తుల సిట్టింగ్‌ సా మర్థ్యం, బారీకేడ్ల ఏర్పాటు, క్యూలైన్‌ వ్యవస్థ, విద్యుత్‌లైన్‌ వ్యవస్థను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈవో సుబ్బారావు, దేవస్థానం ఇంజనీరింగ్‌ అధికారులు రామకృష్ణ, నూకరత్నం, రాంబాబు ఉన్నారు.

పెద్ద రథానికి ట్రయిల్‌ రన్‌

సత్యదేవుని దివ్యకల్యాణోత్సవాల్లో ఈనెల 11న జరిగే రథోత్సవానికి వినియోగించే పెద్దరథానికి సోమవారం ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్‌ రోహిత్‌ సమక్షంలో ట్రయిల్‌రన్‌ నిర్వహించారు. సుమారు 35 అడుగుల పొడవుల గల ఈ రథంతో కార్యక్రమం నిర్వహించడం అధికారులకు కత్తి మీద సాములా మారింది. గతేడాది ఈ రథోత్సవం ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గం టల వరకు గ్రామంలో మెయిన్‌రోడ్డు మీదుగా జరగనుండడంతో గతేడాది గ్రామంలో విద్యుత్‌సరఫరా నిలుపుదలచేశారు. దీంతో గ్రామస్థులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఆ ఇబ్బం దులు లేకుండా సెంటర్‌ లైటింగ్‌ను జనరేటర్‌ సా యంతో వెలిగించి కేవలం మెయిన్‌రోడ్డుపై విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేసి గ్రామంలో మిగిలిన అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా జరిగేలా దేవస్థానం విద్యుత్‌విభాగం, ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు సం యుక్తంగా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ట్రయిల్‌రన్‌ విజయవంతమైనట్టు అధికారులు తెలిపారు.

Updated Date - May 05 , 2025 | 11:28 PM