Share News

కార్తీకంలో భక్తులకు ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలు

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:12 AM

అన్నవరం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధికి కార్తీకమాసం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందు లు రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు ఈవో వీర్ల సుబ్బారావు పేర్కొన్నారు. ఆదివారం తన కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పా టు చేసి మాట్లాడారు. పర్వదినాల్లో ఒంటిగంట నుంచి వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. ఎక్కడా ట్రాఫిక్‌ ఇబ్బందులు రాకు ండా ఎక్కిడికక్కడ వన్‌వే మాదిరి వాహన రాకపోకలు కొనసాగుతాయ

కార్తీకంలో భక్తులకు  ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న ఈవో

గిరిప్రదక్షిణ రోజున ఉదయం పల్లకీసేవ, మధ్యాహ్నం సత్యరథం

అన్నవరం దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు

అన్నవరం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధికి కార్తీకమాసం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందు లు రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు ఈవో వీర్ల సుబ్బారావు పేర్కొన్నారు. ఆదివారం తన కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పా టు చేసి మాట్లాడారు. పర్వదినాల్లో ఒంటిగంట నుంచి వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. ఎక్కడా ట్రాఫిక్‌ ఇబ్బందులు రాకు ండా ఎక్కిడికక్కడ వన్‌వే మాదిరి వాహన రాకపోకలు కొనసాగుతాయన్నారు. రద్దీరోజుల్లో ప శ్చిమ రాజగోపురం వద్ద హోల్డింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసి లోపల వ్రతమండపాలు ఖాళీఅయిన తరువాతనే కంపార్టమెంట్‌లలో వేచిఉన్న వారిని లోపలకి పంపుతామని దీని వల్ల తోపులాటలకు ఆస్కారం లేకుండా ఉంటుందని ఈ వో తెలిపారు. కార్తీకమాసంలో సత్యదేవుడి గిరిప్రదక్షిణ, తెప్పోత్సవం తదితర ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్న సమయానికి ప్రారంభిస్తామన్నారు. కార్తీకపౌర్ణమి రోజున (నవంబ రు 5) గిరిప్రదక్షిణ జరగనుందన్నా రు. ఉదయం 8.30కి సత్యదేవుడి పల్లకీలో రత్న,సత్యగిరిలు చుట్టూ ప్రదక్షిణ ఉంటుందని.. భక్తులతో మధ్యాహ్నం రెండుగంటల నుంచి సత్యరథం ప్రారంభమవుతుందని సుమారు 1.50 లక్షల మ ంది భక్తులు విచ్చేస్తారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. స్వామివారి తెప్పోత్సవం నవంబరు 2న జరుగుతుందని, ఆ రోజు సాయంత్రం 5.30కి తులసిధాత్రి పూజను నిర్వహించి రాత్రి 7గంటలకు పంపాసరోవరంలో నౌకావిహారం నిర్వహిస్తామన్నారు. వేడుకలకు సంబంధించి విస్తృతప్రచారం గావించినట్టు ఈవో తెలిపారు. సమావేశంలో ఏఈవోలు కృష్ణారావు, అనకాపల్లి ప్రసాద్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2025 | 12:12 AM