భగవద్గీత సారాంశం సకల మానవాళికీ దిక్సూచి
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:12 AM
అన్నవరం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మహాభారతంలో శ్రీకృష్ణుడు, అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత సారాంశం సకల మానవాళికీ దిక్సూచి అని అన్నవరం దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు పేర్కొన్నారు. గురువారం దేవస్థానంలో శ్రీ మద్భగవద్గీత జయంతి వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిం
అన్నవరం దేవస్థానంలో 12 రోజులపాటు గీతాజయంతి వేడుకలు : ఈవో సుబ్బారావు
అన్నవరం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మహాభారతంలో శ్రీకృష్ణుడు, అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత సారాంశం సకల మానవాళికీ దిక్సూచి అని అన్నవరం దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు పేర్కొన్నారు. గురువారం దేవస్థానంలో శ్రీ మద్భగవద్గీత జయంతి వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డిసెంబరు 1 వరకు రోజుకొక పాఠశాల విద్యార్థులకు భగవద్గీత పారాయణ,ధ్యానం, సజ్జనసాంగత్యం నిర్వహిస్తామని.. ఉదయం 9గం టల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఈవో తెలిపారు. గీతాజయంతి రోజున అన్నమయ్య 12వ తరం వారసులు తిరుమల శ్రీవారి ఆలయ సంకీర్తన కైంకర్యవర్యులు తాళ్లపాక స్వామీ జీ విచ్చేస్తారని చెప్పారు. ఈ వేడుకలను గత 12ఏళ్లగా ఏడాదికి ఒకరోజు పెంచుకుంటూ ప్రతీ ఆలయంలో నిర్వహిస్తున్నట్లు గీతాజయంతి ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. గీతాసారాంశాన్ని చిన్నారుల్లోకి తీసుకెళ్లి సమాజానికి మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు.