Share News

అజెండాకు ఆమోదం

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:41 AM

అన్నవరం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుని సన్నిధిలో సోమవారం చైర్మన్‌ రోహిత్‌, ఈవో సుబ్బారావు, వివిధ విభాగాల అధికారులు ప్రవేశపెట్టిన అజె ండాను చైర్మన్‌ రోహిత్‌ ఆమోదించారు. ప్రధానంగా భక్తులు హుండీల్లో సమర్పించిన చీరలు, పంచెలు ఇతర వస్త్రాలు హుండీ లెక్కింపు

అజెండాకు ఆమోదం

అన్నవరం దేవస్థానంలో పలు అభివృద్ధి పనులపై పాలకమండలి సమావేశం

అన్నవరం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుని సన్నిధిలో సోమవారం చైర్మన్‌ రోహిత్‌, ఈవో సుబ్బారావు, వివిధ విభాగాల అధికారులు ప్రవేశపెట్టిన అజె ండాను చైర్మన్‌ రోహిత్‌ ఆమోదించారు. ప్రధానంగా భక్తులు హుండీల్లో సమర్పించిన చీరలు, పంచెలు ఇతర వస్త్రాలు హుండీ లెక్కింపురోజున బహిరంగవేలం నిర్వహించాలని ప్రవేశపెట్టిన అజెండాకు ఆమోదం లభించింది. రౌతులపూడి మండలం గొంది గ్రామంలో ఉన్న మెరకభూమి లో యూకలిప్టస్‌, సురుగుడు, సుబాబుల్‌ మొ క్కలను స్వయంగా దేవస్థానం పెంచేందుకు ఆమోదించారు. స్మార్తఆగమ పాఠశాలలో దాత సహాయంతో జిఐ ప్రోఫైల్‌ షెడ్డు ఏర్పాటుకు చైర్మన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. కొండదిగువున నూతనంగా నిర్మించతలపెట్టిన రఽథశాల నుంచి మెయిన్‌రోడ్డుకు 38 అడుగుల అప్రోచ్‌రోడ్డు, రఽథశాలకు పిల్లర్లు, తదితర పనులకు పిలిచిన టెం డర్లలో లోయెస్ట్‌టెండర్‌ ఆమోదించారు. సమావేశంలో సహాయకమిషనర్‌ రామ్మోహనరావు, ఏఈవోలు కొండలరావు, కృష్ణారావు పాల్గొన్నారు.

కల్యాణోత్సవ ఏర్పాట్లపై రేపు సమీక్ష

మే 7నుంచి ప్రారంభంకానున్న స్వామివారి వార్షిక కల్యాణోత్సవ ఏర్పాట్లపై ఈనెల 23న పెద్దాపురం డీఎస్పీ, ఆర్డీవో అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ఈవో సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులకు లక్ష్యాలను నిర్దేశించనున్నారు.

అన్నవరం దేవస్థానంలో వివాదాలపై నేడు అదనపు కమిషనర్‌ విచారణ

అన్నవరం దేవస్థానంలో ఇటీవల జరుగుతున్న వివాదాలపై దేవదాయకమిషనర్‌ రామచంద్రమోహన్‌ ఆదేశాలతో అదనపు కమిషనర్‌ చంద్రకుమార్‌ మంగళవారం ఉద్యోగులు, ఇతరులను కలిసి ఒక నివేదకను తయారు చేయనున్నారు. దీనిని దేవదాయ కమిషనర్‌కు సమర్పిస్తారు. సోమవారం రాత్రికి అన్నవరం చేరుకున్న ఆయన అతిథిగృహంలో బస చేసి మంగళవారం వివాదాలపై ఆరా తీయనున్నారు. ప్రధానంగా ఈవో కుమారుడు పాలనాపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుండడం, ఇద్దరు ఉద్యోగులు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయడానికి ఒకరు బదిలీపై వెళ్లిపోవడం, మరికొందరు సెలవుపెట్టి వెళ్లడం, మరికొందరు సెలవుకు దరఖాస్తు చేయడానికి ప్రధాన కారణమేమిటి అనేదానిపై విచారణ చేయనున్నట్టు సమాచారం. అయితే ఈవో సిబ్బందిని సమన్వయం చేసుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గంటల తరబడి సమీక్షలు, ఆ సమీక్షల సమయంలో సహచర ఉద్యోగులు ఉన్నా దురుసుగా మాట్లాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల ఒక సూపరెంటెండెంట్‌ను ద్వారకాతిరుమల దేవస్థానానికి బదిలీ చేసిన తరువాత ఈవో వ్యవహారశైలిలో మార్పు కనిపించినట్టు పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:41 AM