7న సత్యదేవుడి ఆలయం మూసివేత
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:43 AM
అన్నవరం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): సె ప్టెంబరు 7న చంద్రగ్రహణం సందర్భంగా అన్నవరంలో సత్యదేవుడి ఆలయం మూసివేయనున్నట్టు ఆలయ ఈవో సు
ఈవో సుబ్బారావు
అన్నవరం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): సె ప్టెంబరు 7న చంద్రగ్రహణం సందర్భంగా అన్నవరంలో సత్యదేవుడి ఆలయం మూసివేయనున్నట్టు ఆలయ ఈవో సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. 7వ తేదీ ఉద యం 10గంటల వరకు వ్రతం టిక్కెట్లు విక్రయించి మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సర్వదర్శనములు నిలుపుదల చేసి తలుపులు మూసివేయడం జరుగుతుందన్నారు. తిరిగి 8వతేదీన సంప్రోక్షణ చేసి ఉదయం 7 గంటల నుంచి సర్వదర్శనాలు వ్రతాలు ప్రారంభమవుతాయని భక్తులు గమనించాలని కోరారు. 7వ తేదీ చంద్రగ్రహణం రాత్రి 9.50కి ప్రారంభమై 1:31 వరకు ఉంటుం దని దేవస్థానం పండితులు తెలిపారు.