సత్యదేవుడి కల్యాణం చూడగ రారండి!
ABN , Publish Date - May 05 , 2025 | 12:35 AM
అన్నవరం సత్యదేవుడి దివ్యకల్యాణోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
అన్నవరంలో ప్రత్యేక ఏర్పాట్లు
అన్నవరం, మే 4(ఆంధ్రజ్యోతి): అన్నవరం సత్యదేవుడి దివ్యకల్యాణోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. స్వామి వార్షిక కల్యాణోత్సవాలు ప్రతి ఏటా వైశాఖశుద్ధ దశమి నుంచి వైశాఖ బహుళపాఢ్యమి వరకు జరుగుతాయి. విశ్వావసు నామసంవత్సరంలో ఉత్సవాలు 7న స్వామి, అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెలను చేయడంతో ప్రారంభమై 13వ తేదీ రాత్రి శ్రీపుష్పయాగ మహోత్సవంతో ముగుస్తాయి. దివ్యకల్యాణం 8న రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. స్వామి కల్యాణోత్సవానికి అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాకారం, గోపురాలకు రంగులు వేస్తున్నారు. స్వామివారి సన్నిధిలో జరిగే వేడుకల్లో వార్షిక కల్యాణోత్సవాలకు ప్రాధాన్యం ఉంది. రాష్ట్రం నలుమూలల నుంచి దివ్యకల్యాణం తిలకించేందుకు వేలాదిగా రత్నగిరికి తరలివస్తారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను అం దజేశారు.వారం రోజులు కొండపై వైదిక కార్యక్రమాలతో పాటు కొండదిగువున గ్రామోత్సవాలు (వివిధ వాహనసేవలు) నిర్వహిస్తారు. దివ్యకల్యాణోత్సవాలకు పెండ్లిపెద్దలుగా క్షేత్రపాలకులైన సీతారాములు వ్యవహరిస్తారు. వారం రోజులు ఆర్జితసేవ నిత్యకల్యాణం తా త్కాలికంగా నిలుపుదల చేస్తారు. ఉత్సవాలకు బడ్జెట్‌లో రూ.50 లక్షలు కేటాయించారు.
షెడ్యూల్ ఇలా..
ఫ తొలిరోజు 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు అనివేటి మండపంలో స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా చేస్తారు. రాత్రి 7గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు సీతారాములను వెండి ఆంజనేయ వాహనంపై ఊరేగిస్తారు.
ఫ రెండోరోజున రాత్రి 9 గంటలకు స్వామి, అమ్మవార్ల దివ్యకల్యాణం.సత్యదేవుడిని వెండి గజవాహంపై, అమ్మవారిని వెండి గరుడ వాహనంపై పెండ్లి పెద్దలైన సీతారాములను వెండి పల్లకిలో ఊరేగిస్తారు.
ఫ మూడో రోజు సాయంత్రం 6.30 గంట లకు నవదంపతులకు అరుంధతీ నక్షత్రదర్శన కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు కొండదిగువున రావణబ్రహ్మ వాహనంపై గ్రామోత్సవం జరగనుంది.
ఫ నాలుగోరోజున మధ్యాహ్నం 2.30 గం టలకు పండిత సదస్యం ఉంటుంది. పం డితులు సత్యదేవుడి సన్నిధికి విచ్చేసి నూతన దంపతుల సమక్షంలో తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తారు.రాత్రి 9గంటలకు పొన్నవాహనంపై గ్రామోత్సవం.
ఫ ఐదోరోజు నూతన దంపతులైన సత్యదేవుడు,అనంతలక్ష్మి అమ్మవార్లను మధ్యా హ్నం 2.30 గంటలకు దేవస్థానం ఉద్యా నవనానికి తీసుకువచ్చి వనవిహార మహోత్సవం చేపడతారు. సాయంత్రం 4 గంటలకు పెద్దరథంపై గ్రామోత్సవం
ఫ ఆరో రోజున ఉదయం 5 గంటలకు శేషహోమాలు, కోట్నాలు నిర్వహించి పండితులుఅమ్మవారితో గౌరీపూజ చేయిస్తారు. ఉదయం 9 గంటలకు పంపా సరోవరంలో చక్రస్నానం నిర్వహిస్తారు.
ఫ చివరి రోజున రాత్రి 8 గంటలకు నిత్యకల్యాణమండపంలో శ్రీపుష్పయాగం నిర్వహిస్తారు. వివిధ సుగందభరిత పుష్పాలతో, స్వామి,అమ్మవార్లను అర్చించి విశేష పదార్థాలను నివేదిస్తారు. కార్యక్రమానికి హాజరైన దంపతులకు దంపతీ తాంబూలాలు, మహిళలకు రవికలను ఉచి తంగా అందజేస్తారు.