Share News

విజయవాడ దుర్గమ్మకు అన్నవరం దేవస్థానం సారె

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:35 AM

అన్నవరం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మకు అన్నవరం దేవస్థానం తరుపున గురువారం ఈవో సుబ్బారా

విజయవాడ దుర్గమ్మకు అన్నవరం దేవస్థానం సారె
విజయవాడ దుర్గమ్మకు సారె సమర్పిస్తున్న అన్నవరం ఈవో, ఇతర అధికారులు

అన్నవరం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మకు అన్నవరం దేవస్థానం తరుపున గురువారం ఈవో సుబ్బారావు, దేవస్థానం ప్రధానార్చకులు, ఇతర అధికారులు పట్టువస్త్రాలు, సారెను సమర్పించారు. ఏటా దసరా ఉత్సవాల్లో అమ్మవారి సోదరుడిగా సత్యదేవుడి తరుపున పట్టువస్త్రాలు అందించడం, స్వామివారి వార్షిక కల్యాణాలకు విజయవాడ దేవస్థానం నుంచి అన్నవరం దేవస్థానానికి పట్టువస్ర్తాలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా అన్నవరం దేవస్థానం అధికారులకు విజయవాడ దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈవో వెంట ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యం, ఏఈవో భాస్కర్‌, సూపరెంటెండెంట్‌ రామకృష్ణ, అన్నవరం దేవస్థానం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంటా విష్ణు, ఏపీఆర్వో గణపతి తదితరులున్నారు.

Updated Date - Sep 26 , 2025 | 12:35 AM