సుబ్రహ్మణ్యేశ్వరుడు పెళ్లి కొడుకాయెనే..
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:08 AM
అన్నవరం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో కొలువుదీరిన సుబ్రహ్మణ్యస్వామి దివ్యకల్యాణోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవం
అన్నవరంలో నేడు దివ్యకల్యాణం
రేపు శ్రీపుష్పయాగ మహోత్సవం
అన్నవరం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో కొలువుదీరిన సుబ్రహ్మణ్యస్వామి దివ్యకల్యాణోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం సుబ్రహ్మణ్యేశ్వరుడు, వలీ,్లదేవసేనలను పెళ్లికుమారుడు,పెళ్లి కుమార్తెలుగా అలంకరించారు. సాయంత్రం 4గంటలకు ఆలయంలో ప్రత్యేక వేదిక వద్దకు నవ వదూవరులు కానున్న స్వామి,అమ్మవార్లను బాజాభజంత్రీల నడుమ తోడ్కొనివచ్చారు. పండితులు గణపతిపూజ, పుణ్యాహవచనం శ్రీసూక్త, పురుషసూ క్త విధానంలో నిర్వహించారు. అనంతరం ఉ ల్లూకల గౌరీపూజను నిర్వహించగా ముత్తైదువులు పసుపుదంచారు. స్వామి,అమ్మవార్లను వి శేష అభరణాలు, సుగందభరిత పుష్పాలతో అల ంకరించారు. అధికసంఖ్యలో భక్తులు హాజరయ్యా రు. కార్యక్రమం అనంతరం చతుర్వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేసి మహిళలకు నానబెట్టిన శెనగలను ప్రసాదంగా పంపిణీచేశారు. రా త్రి 7గంటలకు స్వామివారిని మయూర వాహన ంపై అమ్మవార్లను శేషవాహనంపై ఆశీనులు గా వించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులకు అసౌ కర్యం కలగకుండా ఆలయకమిటీ ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.
దేవస్థానం హైస్కూల్ ప్రాంగణంలో వేడుక
వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్యకల్యాణం బుధవారం రాత్రికి అంగరంగ వైభవంగా జరగనుంది. ఆలయం ఎదురుగా ఉన్న అన్న వరం దేవస్థానం హైస్కూల్ ప్రాంగణంలో ఈ వేడుకను నిర్వహిస్తారు. ఉదయం నుంచి అన్న వరం పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల సౌకర్యార్ధం ఆలయ కమిటీ ప్రత్యేక క్యూలైన్‌లను ఏర్పాటు చేశారు. గురువారం జరిగే శ్రీపుష్పయాగ మహోత్సవంతో వేడుకలు ముగుస్తాయి.