శ్రీ పుష్పయోగం... భక్తజన తన్మయత్వం..
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:08 AM
అన్నవరం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరంలో కొలువైన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్యకల్యాణోత్సవాలు గురువారం రాత్రి జరిగిన శ్రీపుష్పయోగ మహోత్సవంతో ముగిశాయి. రాత్రి 8గంటలకు నవదంపతులైన స్వామి,అమ్మవార్లను ఆలయప్రాంగణంలో ఏర్పాటుచే
అన్నవరంలో ముగిసినసుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య కల్యాణోత్సవాలు
అన్నవరం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరంలో కొలువైన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్యకల్యాణోత్సవాలు గురువారం రాత్రి జరిగిన శ్రీపుష్పయోగ మహోత్సవంతో ముగిశాయి. రాత్రి 8గంటలకు నవదంపతులైన స్వామి,అమ్మవార్లను ఆలయప్రాంగణంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై ఆశీనులు గావించి అర్చకస్వాములు గణపతిపూజ, పుణ్యాహవచనం నిర్వహించి స్వామి, అమ్మవార్ల అష్టోత్తర శతనామాలతో పుష్పార్చన గావించారు. అనంతరం సుగందభరిత పుష్పాలతో అలంకరించిన ఊగుటూయలలో నవదంపతులను ఉంచి విశేష పదార్థాలను, పలురకాలైన పండ్లను ఉంచి నివేదన గావించి వదూవరులకు ఏకాంతసేవ నిర్వహించారు. చతుర్వేదపండితుల వేదాశీర్వచనాలు, కార్యక్రమానికి హాజరైన దంపతులకు దంపతీతాంబూలాలు అందజేశారు. కార్యక్రమం తిలకించేందుకు అధికసంఖ్యలో మహిళాభక్తులు విచ్చేయగా వారికి రవికవస్త్రం అందించారు. వైదిక కార్యక్రమాలను చామర్తి కన్నబాబు, పాలంకి చినపట్టాభి తదితరులు నిర్వహించగా ఆలయకమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.